• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2 ఫస్ట్ సాంగ్.....

పుష్ప 2 ఫస్ట్ సాంగ్.. దేశమే దద్దరిల్లే, భూమే బద్దలయ్యే

| ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మొదటి లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు.

By - Tupaki Desk
Update: 2024-05-01 12:59 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ పుష్ప 2 పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మొదటి లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు.

దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇక సుకుమార్ దేవి కాంబినేషన్ అంటేనే అది బెస్ట్ ఆల్బమ్ అని చెప్పవచ్చు. అందులోనూ అల్లు అర్జున్ హీరో అంటే తప్పకుండా అతని స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా దేవి ట్యూన్స్ రెడీ చేస్తూ ఉంటాడు. ఇక పుష్ప పుష్ప రాజ్.. అనే సాంగ్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. అందులో హీరో క్యారెక్టర్ ను హైలైట్ చేస్తూ సింగర్స్ పాడిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది.

నకాజ్ అజీజ్, దీపక్ బ్లూ పాడిన ఈ పాటలో పుష్పరాజ్ పాత్రను మరింత పవర్ఫుల్ గా హైలెట్ చేశారు. చంద్రబోస్ సమకూర్చిన సాహిత్యం మాస్ ఆడియెన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా సాగింది. 'నువ్వు గెడ్డం అట్టా సవరిస్తుంటే దేశమే దద్దరిల్లే, నువ్వు భుజమే ఎత్తి నడుస్తూ ఉంటే భూమే బద్దలయ్యే' అంటూ పవర్ఫుల్ లైన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారు. అలాగే ఎవరికీ తలవంచకుండా బాస్ లా బ్రతకాలి.. అమ్మకు దేవుడికి తప్ప ఎవరికీ తలవంచని పుష్ప అంటూ అతని క్యారెక్టర్ లోని అంశాలను సాంగ్ లో మరింత హైలెట్ చేశారు.

మధ్యలో షూ వేసుకుని ఫోన్ మాట్లాడుతూ ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్పులు కూడా మంచి కిక్ ఇస్తున్నాయి. ఇక ఈ పాటను తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం బెంగాలీ కన్నడ హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు. అయితే ఒకే తరహా సింగర్స్ తో కాకుండా ఆ భాషలకు తగ్గట్టుగా దేవి వేరే సింగర్స్ ద్వారా పాడించడం విశేషం.

మొత్తానికి లిరికల్ వీడియో కూడా పుష్ప రాజ్ క్యారెక్టర్ ను మరింత హైలైట్ చేసే విధంగా కనిపిస్తోంది. సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఇదివరకే కొన్ని అప్డేట్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ మొదటి పాటతో కూడా అంచనాల స్థాయిని మరింత పెంచుతున్నారు. మరి ఈ పాట మొదటి 24 గంటల్లో ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక పుష్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

Full View
Tags:    
  • Pushpa2 
  • PushpaRajSong 
  • PushpaPushpaLyricalSong 
  • PushpaLyricalVideoSong 
  • AlluArjun 
  • RashmikaMandanna 
  • JagapathiBabu 
  • Sunil 
  • AnasuyaBharadwaj 
  • RaoRamesh 
  • Sukumar 
  • DeviSriPrasad 
  • MythriMovieMakers 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

Copyright @2026

Powered by Blink CMS