• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2 గాసిప్స్… ఓ...

పుష్ప 2 గాసిప్స్… ఓ క్లారిటీ వచ్చేసింది

| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ పుష్ప 2. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది

By - Tupaki Desk
Update: 2023-09-11 04:04 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ పుష్ప 2. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాకి వచ్చిన కలెక్షన్స్ స్థాయిలో పుష్ప ది రూల్ బడ్జెట్ ఉంది. పుష్పరాజ్ ఇంటర్నేషనల్ స్మగ్లర్ లా ఎలా ఎదిగాడు అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

బన్నీ, దేవిశ్రీ ప్రసాద్ కి నేషనల్ అవార్డులు రావడంతో పుష్ప ది రూల్ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతో మూవీ చుట్టూ చాలా రకాలా రూమర్స్ అలుముకుంటున్నారు. గతంలో సాయి పల్లవిని ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదని తేలిపోయింది. తాజాగా ప్రియమణిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా ప్రియమణి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఆమె నటించిన షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో ప్రియమణి పుష్పలో నటించడంపై రియాక్ట్ అయ్యారు. పుష్ప టీమ్ నుంచి తనని ఎవరూ సంప్రదించలేదని చెప్పుకొచ్చింది. అలాగే ఆ సినిమాలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఒక వేళ అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే వదులుకోనని స్పష్టం చేశారు.

దీంతో పుష్ప 2 మూవీలో ప్రియమణి నటిస్తోందనే వార్తలకి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ మూవీపై బజ్ ఉన్న నేపథ్యంలో ఇతర భాషలకి చెందిన నటీనటులని కూడా ఈ చిత్రం కోసం సుకుమార్ ఎంపిక చేసాడని అందరూ భావించారు. అయితే కథ డిమాండ్ మేరకు పాత్రలు కూడా ఉంటాయని తెలుస్తోంది. మొదటి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ పార్ట్ 2లో కూడా కొనసాగుతున్నాయంట.

అదనంగా ఈ చిత్రంలో జగపతిబాబు కనిపించబోతున్నాడు. అయితే అతను మెయిన్ విలన్ కాదని తెలుస్తోంది. ఫాహద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్యనే పార్ట్ 2 స్టోరీ అంతా నడుస్తుందని తెలుస్తోంది. మరి వీరిద్దరి రివెంజ్ ఛాలెంజ్ పుష్ప 2 ఏ మేరకు ఆడియన్స్ కి చేరువ చేస్తాయనేది చూడాలి.

Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • Rashmika 
  • Pushpa2movie 
  • Pushpatherule 
  • Priyamani 
  • Pushpamovie 
  • Iconstar 
  • Jawanmovie 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS