• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప-2.. మళ్ళీ ఏదో...

పుష్ప-2.. మళ్ళీ ఏదో అయ్యింది?

| పుష్ప-1కు మించి సీక్వెల్ ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. దీంతో సుకుమార్ కూడా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారుకొట్టిన రూబెన్ | Editor Antony Ruben

By - Tupaki Desk
Update: 2024-05-16 12:33 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. పుష్ప-1కు మించి సీక్వెల్ ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. దీంతో సుకుమార్ కూడా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిట్ టు బిట్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని షూటింగ్ పూర్తి చేస్తున్నారు.

మరో మూడు నెలల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక విడుదలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఈ సినిమా టీమ్ నుంచి కీలక టెక్నీషియన్ తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ఈ మూవీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. డేట్స్ సమస్యల కారణంగా ప్రాజెక్టు నుంచి ఫ్రెండ్లీగా ఆయన తప్పుకున్నట్లు సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే కమిట్మెంట్స్ వల్ల ప్రాజెక్టుకు బై చెప్పినట్లు టాక్ నడుస్తోంది.

మూడేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప: ది రైజ్ తో పాటు జవాన్, బిగిల్, మెర్సల్, వివేగం వంటి అనేక సూపర్ హిట్ సినిమాలకు ఆంటోనీ రూబెన్ ఎడిటర్ గా వ్యవహరించారు. అయితే పుష్ప-2 కాకుండా అట్లీ, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కాంబోలో వస్తున్న బేబీ జాన్ సినిమాకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు ఆంటోనీ. మరో చిత్రానికి కూడా ఇప్పటికే కమిట్ అయ్యారు. దీంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పుష్ప-2 నుంచి ఆయన తప్పుకున్నారట.

అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ చేయాలంటే ఆంటోనీ రూబెన్ ప్లేస్ ను వేరే వారితో అర్జెంట్ గా రీప్లేస్ చేయాలి. కనుక సుకుమార్ టీమ్ కొత్త ఎడిటర్ విషయంలో చాలా ఆలోచించిందట. చివరకు నేషనల్ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలికి సుకుమార్ ఎడిటింగ్ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ ను త్వరగా నవీన్ నూలి పూర్తి చేస్తున్నారని టాక్ నడుస్తోంది. కాబట్టి మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి ఛేంజ్ ఉండదని సమాచారం.

అయితే నవీన్ నూలి గతంలో సుకుమార్ తో కలిసి పలు సినిమాలకు వర్క్ చేశారు. నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్ రంగస్థలం చిత్రాలకు ఆయనే ఎడిటర్ గా వ్యవహరించారు. ఇక అల్లు అర్జున్ తో కలిసి అల వైకుంఠపురములో మూవీ కోసం వర్క్ చేశారు. ఇప్పుడు పుష్ప-2తో పాటు పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ మూవీకి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి బన్నీ ఫ్యాన్స్ వర్రీ అవ్వద్దొని, ఆగస్టు 15వ తేదీ మూవీ పక్కా రిలీజ్ అవుద్దని అంతా చెబుతున్నారు.

Tags:    
  • Pushpa2editor 
  • Antonyruben 
  • Alluarjun 
  • Sukumar 
  • Rashmika 
  • Pushpatherule 
  • Pushpa2 
  • Tollywood 
  • Anasuya 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

Copyright @2026

Powered by Blink CMS