వారి వల్లే పుష్ప2కు మరో రూ.500 కోట్లు కలెక్షన్లు పెరిగాయి
ఒక్కో సారి చిన్న ఆలోచన మొత్తం అన్ని పరిస్థితుల్ని మార్చేస్తుంది. సినీ ఇండస్ట్రీ కూడా దీనికి అతీతం కాదు.;
ఒక్కో సారి చిన్న ఆలోచన మొత్తం అన్ని పరిస్థితుల్ని మార్చేస్తుంది. సినీ ఇండస్ట్రీ కూడా దీనికి అతీతం కాదు. ఓ చిన్న ప్రమోషనల్ ఐడియా తమ సినిమా రూపురేఖల్నే మార్చేసిందని చెప్తున్నారు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్. పుష్ప2 సినిమాకు బీహార్ లో చేసిన ఈవెంట్ వల్ల మూవీకి మంచి క్రేజ్ రావడంతో పాటూ కలెక్షన్లు కూడా బాగా పెరిగాయని ఆయన చెప్పారు.
తెలుగు సినిమాలకు నార్త్ లో క్రేజ్
ఈ మధ్య టాలీవుడ్ సినిమాలకు నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడటం వల్ల అక్కడ్నుంచి విపరీతమైన కలెక్షన్లు వస్తున్నాయి. బాహుబలి సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన పుష్ప2 వరకు అన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లు అవగా, ఆ సినిమా కలెక్షన్లలో ఎక్కువ భాగం నార్త్ నుంచి వచ్చినవే. బాహుబలి మూవీ తెలుగు రాష్ట్రాల మార్కెట్ నుంచి రూ.330- రూ.350 కోట్లు కలెక్ట్ చేస్తే నార్త్ ఇండియా, హిందీ, ఓవర్సీస్ నుంచి రూ.1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
బీహార్ ఈవెంట్ తో పెరిగిన కలెక్షన్లు
పుష్ప2 కూడా నార్త్ లో అలానే మ్యాజిక్ చేసింది. సౌత్ నుంచి దాదాపు రూ.320 కోట్లు వసూలు చేసిన పుష్ప2, నార్త్ ఇండియా, బాలీవుడ్, ఓవర్సీస్ నుంచి రూ.900 కోట్లకు పైగా వసూలు చేసిందని, మరీ ముఖ్యంగా బీహార్ నుంచి ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎవరూ ఊహించలేదని రవి శంకర్ వెల్లడించారు. దానికి కారణం బీహార్ లో చేసిన భారీ ఈవెంటేనని, ఆ ఈవెంట్ చేయాలనే ఆలోచన చాయ్ బిస్కెట్ టీమ్ నుంచి వచ్చిందని ఆయన చెప్పారు.
ఏదొక రోజు వేల కోట్ల బ్రాండ్ గా మారుతుంది
పుష్ప2 ప్రమోషన్స్ కోసం పెద్ద కంపెనీలతో మీటింగ్స్ ఏర్పాటు చేశాక, శరత్, అనురాగ్ నుంచి బీహార్ ఈవెంట్ ఆలోచన వచ్చిందని, ఆ ఈవెంట్ తర్వాతే సినిమాకు హిందీ మార్కెట్ లో హైప్ ఒక్కసారిగా ఊపందుకుందని, ఆ రీజన్ తోనే తమకు హిందీ బాక్సాఫీస్ నుంచి అదనంగా రూ.500 కోట్ల ఆదాయం వచ్చిందని, మైత్రీ మరియు చాయ్ బిస్కెట్ కలిసి స్టార్ట్ అయ్యాయని, అప్పటినుంచి తాము చాయ్ బిస్కెట్ తో కలిసే వర్క్ చేస్తున్నామని, ఇప్పుడు చాయ్ షాట్స్ తో కలిసి వర్క్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని, ఏదొక రోజు చాయ్ షాట్స్ వేల కోట్ల బ్రాండ్ గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చాయ్ బిస్కెట్ ను ప్రశంసిస్తూ రవి శంకర్ చేసిన ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.