• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2: 'కిస్ కిసిక్కా'...

పుష్ప 2: 'కిస్ కిసిక్కా' వచ్చేసింది.. శ్రీలీల దెబ్బల గోల

| ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న 'కిస్ కిసిక్కా' పాట తాజాగా విడుదల అయింది.

By - Tupaki Desk
Update: 2024-11-24 15:23 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ సాధించిన అపార విజయం తర్వాత, ఇప్పుడు పుష్ప: ది రూల్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టు పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి మాస్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.


ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న 'కిస్ కిసిక్కా' పాట తాజాగా విడుదల అయింది. సుకుమార్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ పాటలో అల్లు అర్జున్, టాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల కలిసి అదిరిపోయే స్టెప్పులతో సందడి చేశారు. ఊ అంటావా మామ పాట తర్వాత ఈ సాంగ్ మరో సెన్సేషన్‌గా నిలుస్తుందని ఇప్పటికే మేకర్స్ నమ్మకంతో అప్డేట్స్ ఇచ్చారు. ఇక బన్నీ, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ, ఎనర్జీని పాటలో చూడొచ్చు. ఈ పాటలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆడియన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది.

మాస్ బీట్‌కు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్, హై ఎనర్జీ స్టెప్పులతో ఈ పాట మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక సుబ్లషిని ఈ పాటను పాడగా, గణేష్ ఆచార్య కొరియోగ్రాఫీ అందించారు. సినిమాలో కీలకమైన ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులను పూనకం తెప్పించేందుకు సిద్ధంగా ఉంది. ఊ అంటావా మామ పాట ఎంతగా ఆకట్టుకుందో, కిస్ కిసిక్కా కూడా ఆ స్థాయిని అందుకోవడమే కాకుండా దాటుతుందని భావిస్తున్నారు.

పుష్ప సిరీస్ కోసం దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన సంగీత ప్రతిభను నిరూపించాడు. ముఖ్యంగా శ్రీలీల దెబ్బలు పడతాయ్ రో అంటూ స్టెప్పులు వేసిన విధానం హైలెట్ అవుతోంది. 'కిస్ కిసిక్కా' పాట విడుదల తర్వాత సోషియల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావుడి జరుగుతోంది. బన్నీ, శ్రీలీల పోటాపోటీ డ్యాన్స్‌లను చూసి అభిమానులు తెగ ప్రశంసిస్తున్నారు. పాటలో ఇద్దరి ప్రెజెన్స్, సుకుమార్ క్రియేటివిటీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ పాట ప్రత్యేకంగా డిజైన్ చేసిన నేపథ్యంలో భారీ సెట్ వర్క్ కూడా మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో డిసెంబర్ 5న థియేటర్లలో పుష్ప 2 విడుదలతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ అవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 'కిస్ కిసిక్కా' పాటతోనే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. మరి బన్నీ, శ్రీలీల తీసుకొచ్చిన ఈ మ్యూజికల్ ట్రీట్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Full View
Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Rashmika 
  • Sreeleela 
  • Itemsong 
  • Kissiksong 
  • Sukumar 
  • Tollywood 
  • Mythrimoviemakers 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS