బన్నీ గెటప్ తో డబ్బులు సంపాదించుకుంటున్న ఫ్యాన్
నిజానికి పుష్ప రాజ్ రోల్ కు నార్త్ టూ సౌత్ ఎంతలా కనెక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;
పోలీసోడే కాదు.. పోలీసోడి ఒంటి మీద ఉన్న యూనిఫాం కూడా డ్యూటీ చేస్తుంది అన్నట్టు.. అల్లు అర్జున్ ఏ కాదు.. అల్లు అర్జున్ లాగా గెటప్స్ వేసుకున్న వాళ్లకు కూడా కాసుల వర్షం కురుస్తుంది.. లక్షాధికారిగా మార్చేసింది.. అలా బన్నీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప గెటప్ తో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో అందుకున్నాడు పుష్ప డూప్.
నిజానికి పుష్ప రాజ్ రోల్ కు నార్త్ టూ సౌత్ ఎంతలా కనెక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ లో మెప్పించిన పుష్ప సిరీస్ చిత్రాల్లో అల్లు అర్జున్ పాత్రను ఆ విధంగా డిజైన్ చేశారు డైరెక్టర్ సుకుమార్. నెవ్వర్ బిఫోర్ అనేలా రూపొందించారు. దీంతో పుష్ప గెటప్, మేనరిజమ్, డైలాగ్స్ కు ఫిదా అయిపోయారు.
కొంతకాలంగా అల్లు అర్జున్ తో కాస్త పోలికలు ఉన్న వ్యక్తి.. పుష్ప గెటప్ వేసుకుని సందడి చేస్తున్నారు. అయితే హీరోలతో పోలికలు ఉన్న పర్సన్స్.. వారి గెటప్స్ వేసుకుని ఎప్పటికప్పుడు కనిపిస్తుంటారు. ఇప్పటికి అలా చాలా సార్లు జరిగింది. కానీ పుష్ప గెటప్ వేసుకున్న వ్యక్తి మాత్రం పాపులర్ అయిపోయారు. సెలబ్రిటీ హోదా దక్కించుకున్నారని చెప్పాలి.
కొన్ని రోజులుగా అనేక ఈవెంట్స్ కు ఏకంగా గెస్ట్ గా వెళ్తున్నారు. ర్యాలీలు, సభలకు హాజరవుతున్నారు. టీవీ షోలకు, ఓపెనింగ్స్ ఈవెంట్స్ కు కూడా వెళ్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఉన్న ప్రజలు చూస్తుంటే.. ఆయనకు ఎంత క్రేజ్ ఉందో క్లియర్ గా తెలుస్తోంది.
అదే సమయంలో అతడితో ఒక సంస్థ యాడ్ షూట్ కూడా చేయడం విశేషం. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ కు రూ. 12,00,000 అందుకున్నారని నెట్టింట ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. అవును.. మీరు చదివింది నిజమే.. రూ.12 లక్షలు తీసుకున్నారట.
ఒక సంవత్సరం శాలరీ అనుకున్నారేమో.. కాదు కాదు. ఒక యాడ్ కు తీసుకున్న ఎమౌంట్ మాత్రమే! దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ రేంజ్ లో నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. యాడ్ కు రూ.12 లక్షలా అంటూ నోరెళ్లబెడుతున్నారు. అయితే అది నిజమో లేదో తెలియకపోయినా నెట్టింట మాత్రం వైరల్ అవుతోంది.