పుష్ప 3.. ప్లాన్ చేశారు కానీ..?

సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 1 అండ్ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఈ సినిమాలతో బన్నీ మాస్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఏర్పడింది.;

Update: 2025-08-25 05:47 GMT

సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 1 అండ్ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఈ సినిమాలతో బన్నీ మాస్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఏర్పడింది. ఐతే పుష్ప 1 ది రైజ్.. పార్ట్ 2 ది రూల్ చూపించిన సుకుమార్ పుష్ప 3 ది రాంపేజ్ అంటూ ఫిక్స్ చేశాడు. ఐతే పుష్ప 1 అండ్ 2 వెంటనే తీసిన సుకుమార్ పార్ట్ 3 కి కాస్త టైం తీసుకోవాలని అనుకున్నాడు. అసలైతే పుష్ప 2 కోసం ఫస్ట్ రిలీజ్ చేసిన పుష్ప రాజ్ అడవుల్లో వెళ్లిన కాన్సెప్ట్ అంతా ఇప్పుడు పార్ట్ 3 లో చూస్తామన్నామాట.

పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్..

సినిమాపై బజ్ పెరగడంతో పార్ట్ 2 కథ మార్చేశాడు సుకుమార్. ఐతే పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక పార్ట్ 3 కొన్నాళ్లు ఆగాక చేద్దామని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఐతే పుష్ప 3 మరీ లేట్ గా కాకుండా 2028 రిలీజ్ అనుకున్నారట. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే 2028 కాదు 2030 లో కూడా పుష్ప 3 వచ్చేలా లేదు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ప్రెజంట్ అట్లీ డైరెక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నాడు.

అట్లీతో అల్లు అర్జున్ చేసే సినిమా కూడా భారీ లెవెల్ లో రాబోతుంది. ఈ సినిమా పూర్తి చేశాక నెక్స్ట్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఐతే పుష్ప 3 విషయంలో అటు అల్లు అర్జున్, ఇటు సుకుమార్ కొంత టైం తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ కమిటైన సినిమాలన్నీ పూర్తి చేసి నెక్స్ట్ పుష్ప 3 గురించి ఆలోచించాలి. కానీ చూస్తుంటే అది ఇంకా టైం పట్టేలా ఉంది. 28 కాదు మరో 3 ఏళ్లు అయినా సినిమా కష్టమనేలా ఉంది.

సుకుమార్ నెక్స్ట్ చరణ్ తో..

సుకుమార్ నెక్స్ట్ రాం చరణ్ తో సినిమా ఉంది. ఆ తర్వాత రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వాటిని పూర్తి చేశాకే పుష్ప 3 చేస్తాడు. తప్పకుండా ఈ కాంబో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని నమ్ముతున్నారు. ఎంత లేట్ అయినా సరే పుష్ప రాజ్ మాస్ రాంపేజ్ మాత్రం ఈసారి అంతకుమించి సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది. పుష్ప ఫ్రాంచైజీలకు నార్త్ సైడ్ సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా ఈ రేంజ్ సక్సెస్ కి కారణం అక్కడ ఆడియన్స్ కి బాగా నచ్చడమే. సో పుష్ప 3 రాంపేజ్ వస్తే ఇక్కడ కాదు అక్కడ కూడా బీభత్సం సృష్టించే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News