పుష్ప-2 రికార్డు.. ఎవరూ బ్రేక్ చేయలేరా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప 2: ది రూల్ మూవీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప 2: ది రూల్ మూవీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. 2024 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఆ సినిమా.. నార్త్ టు సౌత్ ఓ ఊపు ఊపేసింది. విడుదలైన ప్రతి సెంటర్ లో కూడా భారీ వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.
అయితే వసూళ్ల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన పుష్ప-2 మూవీ.. ఫుట్ ఫాల్స్ విషయంలో కొత్త చరిత్ర క్రియేట్ చేసింది. థియేట్రికల్ ఫుల్ రన్ లో 3.7 కోట్ల ఫుట్ ఫాల్స్ నమోదు చేసిన ఆ సినిమా.. టాప్ ప్లేస్ లో ఉంది. పాన్ ఇండియా రిలీజ్, మాస్ హైప్, అల్లు అర్జున్ స్టార్ డమ్ కలిసి సినిమాను ఆ స్థాయికి తీసుకెళ్లాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
అదే సమయంలో పుష్ప-2 తర్వాత వివిధ సినిమాలు రిలీజ్ అయినా.. ఫుట్ ఫాల్స్ రికార్డు మాత్రం అలానే ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ ధురంధర్.. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన పుష్ప-2 రికార్డును బ్రేక్ చేసింది. దీంతో అదే సినిమా పేరిట ఉన్న హయ్యెస్ట్ ఫుట్ ఫాల్స్ రికార్డు కూడా బ్రేక్ చేస్తుందని అనేక మంది అంచనా వేశారు.
కానీ ధురంధర్.. 53 రోజుల థియేట్రికల్ రన్ లో సుమారు 3.5 కోట్ల ఫుట్ ఫాల్స్ నమోదు చేసింది. ముఖ్యంగా ఆ చిత్రం కేవలం హిందీ బెల్ట్‌లో మాత్రమే రిలీజ్ అయినప్పటికీ ఇంత భారీ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం విశేషం. దీంతో ధురంధర్ 2025 సంవత్సరంలో అత్యధికంగా వీక్షించిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది. 3 కోట్ల ఫుట్ ఫాల్స్ సాధించిన ఛావా రికార్డును కూడా ఇది సులభంగా దాటేసింది.
కొందరు ఊహించినట్టు పుష్ప-2 రికార్డు మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. అయితే ధురంధర్ థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకోవడంతో పుష్ప 2 రికార్డును దాటే అవకాశం దాదాపు లేదని చెప్పాలి. అయినప్పటికీ ఆ చిత్రం సాధించిన కలెక్షన్లు బాలీవుడ్ కు కొత్త ఊపునిచ్చాయి. మొత్తానికి, ధురంధర్ అంచనాలను మించి ప్రదర్శన ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్నా, పుష్ప2 దే ఫుట్ ఫాల్స్ విషయంలో టాప్ ప్లేస్.
దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేరని కొందరు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కానీ ప్రస్తుతం అనేక భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. భారీ అంచనాలతో అవన్నీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో ఆ సినిమాల్లో ఏదైనా.. పుష్ప-2 రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..