• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హిందీలో పుష్ప 2...

హిందీలో పుష్ప 2 కలెక్షన్స్… 20 రోజుల లెక్కలివే..

| ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా ‘స్త్రీ 2’ మూవీని రెండు వారాల్లోనే ఈ చిత్రం అధికమించింది.

By - Tupaki Desk
Update: 2024-12-25 12:00 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ దేశ వ్యాప్తంగా 1700 కోట్లు కలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమాకి లాంగ్ రన్ లో ఎంత ప్రాఫిట్ వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో 315 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటిన ఈ చిత్రం హిందీలో దానికి రెట్టింపు వసూళ్లు అందుకుంది. ఇప్పటి వరకు నార్త్ ఇండియాలో ఈ చిత్రానికి 715.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.

అంటే ఈ ఏడాదిలోనే కాకుండా హిందీలో అత్యధిక వసూళ్లు అందుకొని ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా ‘స్త్రీ 2’ మూవీని రెండు వారాల్లోనే ఈ చిత్రం అధికమించింది. అలాగే హిందీ పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు చిత్రంగా మరో అరుదైన ఫీట్ కూడా ఈ మూవీ సాధించింది. ఇక మూడో వారంలో కూడా హిందీ రాష్ట్రాలలో ఈ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ రావడం విశేషం.

16వ రోజైన శుక్రవారం 12.50 కోట్లు వసూళ్లు చేసిన ఈ మూవీ 17వ రోజైన శనివారం ఏకంగా 20.50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక 18వ రోజైన ఆదివారం 27 కోట్లు వసూళ్లు చేసింది. 19వ రోజు 11.75 కోట్లు, 12వ రోజు 11.50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయి. దీంతో ఓవరాల్ గా హిందీలో 715.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఈ చిత్రం అందుకుంది.

మూడో వారంలో కలెక్షన్స్ నిలకడగా సాగుతూ ఉండటంతో లాంగ్ రన్ లో ‘పుష్ప 2’ మూవీ 750-800 కోట్ల మధ్యలో వసూళ్లు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘బాహుబలి 2’ తర్వాత ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తెలుగు చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. ఇక ఈ మూవీతో కలిపి తెలుగులో నాలుగు చిత్రాలు 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘ కల్కి 2898ఏడీ’ వరుస స్థానాలలో ఉన్నాయి.

డే 1 - 72CR

డే 2 - 59CR

డే 3 - 74CR

డే 4 - 86CR

డే 5 - 48CR

డే 6 - 36CR

డే 7 - 31.50CR

డే - 27CR

డే - 27.50CR

డే 10 - 46.50CR

డే 11 - 54CR

డే 12 - 20.50CR

డే 13 - 19.50CR

డే 14 - 17.00CR

డే 15 - 14.00CR

డే 16 - 12.50CR

డే 17 - 20.50CR

డే 18 - 27CR

డే 19 - 11.75CR

డే 20 - 11.50CR

Tags:    
  • Pushpa2 
  • Boxoffice 
  • Hindimarket 
  • Moviecollections 
  • Alluarjun 
  • Sukmar 
  • Stree2 
  • Baahubali2 
  • Kalki2898ad 

Similar News

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

Copyright @2026

Powered by Blink CMS