• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘పుష్ప 2’ ట్రైలర్...

‘పుష్ప 2’ ట్రైలర్ అప్డేట్.. బన్నీపై పాజిటివ్ ఇంప్రెషన్!

| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ''పుష్ప 2: ది రూల్'' సినిమాపై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-11-05 10:41 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ''పుష్ప 2: ది రూల్'' సినిమాపై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా మరో 30 రోజుల్లో ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.


'పుష్ప 2' చిత్రం ఒక నెలలో తుఫానుతో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంటూ మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అల్లు అర్జున్ - ఫహద్ ఫాజిల్ ఇద్దరూ ఎదురెదురుగా ఒకరినొకరు చూసుకుంటున్నట్లు డిజైన్ చేయబడిన ఈ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో పుష్పరాజ్ - భన్వర్ సింగ్ షెకావత్ మధ్య ఇగో క్లాష్ ఏ లెవల్ లో ఉండబోతోందనేది ఈ పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు.

'పుష్ప 2: ది రూల్' ట్రైలర్ అతి త్వరలో రాబోతోందని మేకర్స్ తెలిపారు. ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, నవంబర్ 15న మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. దీని కోసం గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు మూడు వారాల ముందుగా ట్రైలర్ ను విడుదల చేయడం వల్ల, ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది సినిమాపై హైప్ మరింత పెరగడానికి హెల్ప్ అవుతుందని చెప్పాలి.

ఇప్పటికే 'పుష్ప 2' మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, రెండు సాంగ్స్.. అన్నీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసాయి. సినిమాపై ఎక్సపెక్టేషన్స్ రెట్టింపు అవ్వడానికి కారణమయ్యాయి. త్వరలోనే మిగిలిన పాటలను కూడా విడుదల చేయనున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్.. రాబోయే రోజుల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో పాటుగా ముంబై, కొచ్చి, హుబ్లీ, చెన్నై, పాట్నా లాంటి ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన 'పుష్ప ది రైజ్' చిత్రానికి సీక్వెల్ గా ''పుష్ప: ది రూల్'' తెరకెక్కుతోంది. తెలుగుతో పాటుగా హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టడమే లక్ష్యంగా, అన్ని భాషల్లోనూ అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. హైప్ చూస్తుంటే ఈజీగా 1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ మీద ఓ వర్గం మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇరు వర్గాల మధ్య వచ్చిన డిస్టర్బెన్స్ కారణంగా ఫ్యాన్ వార్స్ కూడా గట్టిగానే జరిగాయి. కానీ ఇప్పుడంతా నార్మల్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. 'గేమ్ చేంజర్' కోసం గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ తన 'తండేల్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడం లేదు. రామ్ చరణ్ సినిమాకి పోటీ ఉండకూడదనే వెనక్కి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది మెగా అభిమానుల్లో 'పుష్ప 2' సినిమా మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడటానికి కారణమవుతోంది. అందుకే గత కొన్నిరోజులుగా ఎలాంటి ఫ్యాన్ వార్స్ జరగడం లేదు. కాబట్టి తప్పకుండా ఫ్యాన్స్ అంతా బన్నీ చిత్రాన్ని సపోర్ట్ చేస్తారని భావించవచ్చు.

'పుష్ప 2' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. సునీల్, అనసూయ, బ్రహ్మాజీ, రావు రమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

One month to go for #Pushpa2TheRule ❤‍🔥

Prepare yourself – THE BIGGEST INDIAN FILM of the year is set to take the theaters by storm in a month 💥💥

TRAILER EXPLODING SOON 🌋🌋#1MonthToGoForPushpa2RAGE#Pushpa2TheRuleOnDec5th

Icon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/xbUOAgRWYG

— Mythri Movie Makers (@MythriOfficial) November 5, 2024
Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • Devisriprasad 
  • Rashmika 
  • Anasuya 
  • Mythrimoviemakers 
  • Tollywood 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS