• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూరీ జగన్నాథ్ ఒక క్రేజీ...

పూరీ జగన్నాథ్ ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్!

| ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన పూరీ జగన్నాథ్ కెరీర్ లో కాస్త వెనకపడే సరికి పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి

By - Tupaki Desk
Update: 2024-06-20 13:30 GMT

ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన పూరీ జగన్నాథ్ కెరీర్ లో కాస్త వెనకపడే సరికి పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేసిన పూరీ జగన్నాథ్ ఆ సినిమా సక్సెస్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అది డిజాస్టర్ అవ్వడం వల్ల పూరీకి అవకాశాలు రాలేదు. ఐతే అలాంటి టైం లో పూరీతో మరోసారి కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాడు రాం. ఇద్దరు కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గానే డబుల్ ఇస్మార్ట్ సినిమా చేశారు.

ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ లాక్ చేశారు. పూరీ మార్క్ టేకింగ్ తో రామ్ అదరగొట్టే యాక్టింగ్ తో పాటుగా మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరు మెచ్చేలా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నాడట పూరీ. అంతేకాదు డబుల్ ఇస్మార్ట్ హిట్ అయితే మాత్రం పూరీ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా పూరీ టేకింగ్ గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. పూరీ సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు కానీ దర్శకుడిగా టేకింగ్ లో పూరీ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు.

అందుకే డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ ఒక భారీ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. RRR లో ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ నటించారు. ఇప్పుడు వార్ 2 లో హృతి రోషన్, ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. అదే తరహాలో పూరీ జగన్నాథ్ ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ మల్టీస్టారర్ సినిమాలో ఎవరెవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. పూరీ ప్లానింగ్ ప్రకారం తెలుగు హీరో ఒకరు బాలీవుడ్ హీరో మరొకరని అంటున్నారు.

ఐతే ఆ టాలీవుడ్ లక్కీ హీరో ఎవరు ఆ హిందీ స్టార్ ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది. పూరీ సినిమా అంటే బాలీవుడ్ స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అమితాబ్ తో కూడా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి పూరీ సినిమా అంటే బాలీవుడ్ నటులు కూడా ఆసక్తిగా ఉంటారు. సో ఈ మల్టీస్టారర్ తెర మీదకు రావాలంటే మాత్రం డబుల్ ఇస్మార్ట్ హిట్ అవ్వాల్సిందే. అందుకే పూరీ డబుల్ ఇస్మార్ట్ ని ఎక్కడ టార్గెట్ మిస్ అవ్వకుండా ఫోకస్ తో పనిచేస్తున్నారని తెలుస్తుంది. రామ్ కూడా డబుల్ ఇస్మార్ట్ తో పాన్ ఇండియా రేంజ్ లో విధ్వంస సృష్టించడం పక్కా అని గట్టిగా నమ్ముతున్నాడు. మరి సినిమా ఏం చేస్తుందో చూడాలి.

Tags:    
  • Purijagannadh 
  • Rampothineni 
  • Multistarrermovie 
  • Tollywood 
  • Doubleismart 
  • Filmindustry 
  • Ligermovie 
  • Purijagannadhmovies 

Similar News

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

'ఇడుపు కాయితం' టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..

2026-11-12 06:57 GMT

శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తప్పిన పెద్ద ముప్పు!

2026-11-12 06:51 GMT

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2026-11-12 06:06 GMT

టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులను రప్పించిన సినిమాలు.. పుష్ప 2 రికార్డు ప్రత్యేకం!

2026-11-12 05:55 GMT

అనిరుధ్ పెళ్లి వీడియోలపై వార్నింగ్.. ప్రైవసీకి భంగం కలిగిస్తే చర్యలు తప్పవా?

2026-11-12 05:55 GMT

టాక్సిక్ ఫ్లాప్‌పై కియారా కామెంట్స్.. కన్నడ ఇండస్ట్రీని తప్పుబట్టని హీరోయిన్!

2026-11-12 05:53 GMT

ఒకే ప్రేమ్ లో ర‌ణ‌వీర్..ర‌ణ‌బీర్..దీపిక‌..అలియా!

2026-11-12 05:50 GMT

పవన్ పిల్లలకు ఆ ఆస్తి.. ఎప్పుడిచ్చారంటే!

2026-11-12 04:22 GMT

Copyright @2026

Powered by Blink CMS