ఆటోజానీ.. బెగ్గర్.. చాలా తేడా ఉంది సామి..?
పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తర్వాత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు.;
పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తర్వాత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు. ఫ్లాపుల్లో ఉన్న పూరీకి ఫ్లాప్ పడ్డ ప్రతిసారీ ఇక హీరోలు దొరకడం కష్టం అనుకోవడం కామన్. కానీ ఊహించని కాంబినేషన్ సెట్ చేస్తూ సర్ ప్రైజ్ చేస్తాడు పూరీ. విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ చేస్తున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ ఉంది. అక్కడ ఉంది విజయ్ సేతుపతి కాబట్టి నమ్మకాలు పెట్టుకోవచ్చు అంటున్నారు.
పూరీ విజయ్ సేతుపతి కాంబో బెగ్గర్
ఐతే ఈ సినిమాతో ఒకప్పటి పూరీని గుర్తు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఐతే పూరీ విజయ్ సేతుపతి కాంబో సినిమా బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. బెగ్గర్ టైటిల్ తోనే సినిమా ఏంటన్నది తెలుస్తుంది. ఐతే ఈమధ్య సోషల్ మీడియాలో పూరీ మెగాస్టార్ చిరంజీవి కోసం రాసుకున్న ఆటో జానీ కథనే మార్చి విజయ్ సేతుపతితో చేస్తున్నాడని హడావిడి చేస్తున్నారు. ఐతే అది చిత్ర యూనిట్ ని అడిగితే తెలుస్తుంది.
సార్ మేడం ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన విజయ్ సేతుపతిని బెగ్గర్, ఆటోజానీ ఒకటేనా అని రిపోర్టర్స్ అడిగారు. ఐతే అది తనకు తెలియదని అన్నాడు విజయ్ సేతుపతి. కానీ పూరీ సినిమా చాలా బాగా వస్తుందని అన్నాడు. ఐతే ఆటోజానీ కథ వేరు ఇది వేరు.. అసలు దీనికి దానికి సంబంధం ఉండే ఛాన్స్ లేదని అనిపిస్తుంది. సో విజయ్ సేతుపతి అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే కచ్చితంగా బెగ్గర్ సినిమా పై అంచనాలు పెరిగినట్టే.
పూరీ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ..
విజయ్ సేతుపతి ఏ సినిమా చేసినా అందులో కచ్చితంగా విషయం ఉంటుంది. పూరీతో విజయ్ అనగానే ఇదేదో సంథింగ్ స్పెషల్ మూవీ అనిపించేలా ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక పూరీ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ అయితే మక్కల్ సెల్వన్ తో ఒక అదిరిపోయే బొమ్మ వస్తే మళ్లీ పూరీ తిరిగి ఫాం లోకి వస్తాడని అనుకుంటున్నారు. మరి పూరీ బెగ్గర్ ఎలా ఉంటుంది.. ఏమేరకు అంచనాలు అందుకుంటుందో చూడాలి.
ఆల్రెడీ విజయ్ ఆంటోని బిచ్చగాడు 1, 2 వచ్చాయి.. ఈమధ్యనే ధనుష్ కుబేర అంటూ వచ్చాడు. మరి విజయ్ సేతుపతిని ఏం చెప్పి బెగ్గర్ గా లాక్ చేశాడన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది. ఐతే పూరీ ఈ సినిమాకు మాత్రం తన వర్కింగ్ స్టైల్ అంతా కూడా మార్చేశాడట. తప్పకుండా ఈ సినిమా మళ్లీ ఒకప్పటి పూరీని గుర్తు చేస్తుందని అంటున్నారు.