పూరి పాత పద్దతిలో కొడ్తే మళ్లీ అంతా లైన్లోలోకే!
ఒకప్పుడు పూరి జగన్నాధ్ సినిమాలో నటించడం కోసం స్టార్ హీరోలు క్యూలో ఉండేవారు.;
ఒకప్పుడు పూరి జగన్నాధ్ సినిమాలో నటించడం కోసం స్టార్ హీరోలు క్యూలో ఉండేవారు. డిస్ట్రిబ్యూటర్లు పూరిపై నమ్మకంతో హీరో పనిలేకుండా సినిమా కొనేసేవారు. దీంతో నిర్మాతలు పూరి తో నిర్మాణం కోసం పోటీ పడేవారు. పూరితో సినిమా తీస్తే రెండు రకాల వెసులు బాట్లు హీరో, నిర్మాతలకు దొరికేవి. అతడు త్వరగా సినిమా పూర్తి చేస్తాడు. షూటింగ్ కోసం కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయించడు. వేస్టేజ్ ఎక్కువగా తీయడు. ఆరు నెలల్లో సినిమా పూర్తిచేసి రిలీజ్ చేస్తాడు అన్న ధీమాతో? పని చేసేవారు. అయితే వరుస పరాజయాలు పూరిని రేసులో చాలా వెనక్కి నెట్టాయి.
పూరి కంటే విజయ్ పైనే నమ్మకంతో:
ఎంతగా అంటే? ఆయనకు హీరోలు దొరకనంతగా..హీరోలు ఆయన్ని నమ్మనంతగా. దీంతో పూరి కూడా నిరుత్సాహ పడ్డాడు. గతంలో ఎన్నో హిట్లు ఇచ్చినా? తననే పక్కన బెట్టారు? అన్న అసంతృప్తి లోలోపల ఉంది. ప్రస్తుతం పూరి తో పని చేస్తోంది తమిళ హీరో విజయ్ సేతుపతి అన్న సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా హిట్ తో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి పూరిపై కన్నా నమ్మకం విజయ్ సేతుపతిపైనే ఎక్కువగా ఉంది. ఇది పూరికి ప్లస్ అయింది. ప్లాప్ ల్లో ఉన్న పూరి సినిమాకిప్పుడు విజయ్ ఓ వెపన్ లాంటోడు.
ఆ ఛాన్స్ మళ్లీ తీసుకుంటాడా?
ఈ సినిమాతో పూరి హిట్ ఒక్కటే ఇస్తే సరిపోదు? పాత పద్దతిలో సినిమాలు చేసి హిట్ ఇస్తేనే మళ్లీ హీరోలంతా అతడి క్యూలో ఉంటారు. వరుస ప్లాప్ ల నేపథ్యంలో పూరి సినిమా షూటింగ్ వేగం తగ్గించిన సంగతి తెలిసిందే. పరిశ్రమలో కొంత మంది సీనియర్లు స్లో గా చేయండని సలహా ఇవ్వడంతో పూరి తన స్టైల్ కి భిన్నంగా షూటింగ్ చేస్తున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మళ్లీ పాత పద్దతిలో వేగంగా పూర్తి చేయడం... అది హిట్ అవ్వడం జరగాలి. అప్పుడే పూరి కోసం హీరోలొస్తారు. ప్రస్తుతం దర్శకులంతా పాన్ ఇండియా సినిమా అంటూ సంవత్సరాలు సమయం తీసుకుంటున్నారు.
ఆ కారణంగా హీరోలకు చాలా సమయం పడుతుంది. రెండు మూడేళ్లకు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా తో పాటు, మరో సినిమా మధ్యలో రిలీజ్ చేసుకోవచ్చు. అయితే అలా సాధ్యమవ్వాలంటే? షూటింగ్ వేగంగా పూర్తి చేసే పూరి లాంటి మేకర్ కావాలి. పూరి తర్వాత అలాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరు. దీంతో పూరినే మళ్లీ ఆ ఛాన్స్ తీసుకోవాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది.