క్రేజీ కాస్టింగ్‌..పూరీ ప్లాన్ ఏంటీ? ఏం చేయ‌బోతున్నాడు?

అయితే మ‌ళ్లీ త‌న స‌త్తా చాటుకోవాల‌ని, ట్రాక్‌లోకి రావాల‌ని ఈ సారి పూరి జ‌గన్నాథ్ గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.;

Update: 2025-06-18 05:48 GMT

పూరి జ‌గ‌న్నాథ్‌. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్ మంచి పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడాయ‌న‌. సినిమాని రాకెట్ స్పీడుతో పూర్తి చేయ‌డంలోనూ, హీరోయిజాన్ని స‌రికొత్త‌గా ఎలావేట్ చేయ‌డంలోనూ, డిఫ‌రెంట్ మేకోవ‌ర్‌తో హీరోను ప్ర‌జెంట్ చేయ‌డంలోనూ,అద‌రిపోయే డైలాగ్స్ అందించ‌డంలోనూ ఆయ‌న స్టైల్ ప్ర‌త్యేకం. అయితే ఇది నిన్న‌టి మాట‌. గ‌త కొంత కాలంగా ఆయ‌న త‌న ప‌ట్టుకోల్పోయాడు. వ‌రుస ఫ్లాపుల‌తో ఫామ్‌ని కోల్పోయాడు.

అయితే మ‌ళ్లీ త‌న స‌త్తా చాటుకోవాల‌ని, ట్రాక్‌లోకి రావాల‌ని ఈ సారి పూరి జ‌గన్నాథ్ గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. లైగ‌ర్‌, డ‌బుల్ ఇస్మార్ట్ వంటి వ‌రుస డిజాస్ట‌ర్ల త‌రువాత కొంత విరామం తీసుకున్న పూరీ ఇప్పుడు రెట్టించిన విశ్వాసంతో స‌రికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇందు కోసం త‌మిళ స్టార్ విజ‌య్ సేతుప‌తిని హీరోగా ఎంచుకుని త‌ను ఎంత విల‌క్ష‌ణంగా అడుగులు వేస్తున్నాడో స్ప‌ష్టం చేశాడు.

ఆర్టిస్ట్‌ల విష‌యంలోనూ అదే విల‌క్ష‌ణ‌త‌ని చూపిస్తూ న‌టీన‌టుల‌ని సెలెక్ట్ చేసుకుంటుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇందులో హీరోగా విజ‌య్ సేతుప‌తిని ఫైన‌ల్ చేసుకున్న పూరీ మిగ‌తా కీల‌క పాత్ర‌ల కోసం ట‌బు, క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్‌ల‌ని ఎంపిక చేసుకున్నాడు. తాజాగా మ‌రో కీల‌క క్యారెక్ట‌ర్‌కు సంయుక్త మీన‌న్‌ని తీసుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

ఓ బిచ్చ‌గాడి చుట్టూ తిరిగే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో ప‌క్కా ప్లానింగ్‌తో పూరీ ఈ మూవీని రూపొందించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ సారి ప‌క్కాగా బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకోవాల‌ని, అదే విధంగా ఈ ప్రాజెక్ట్‌ని టాక్ ఆఫ్ ది ఇండియాగా చేయాల‌నే ప‌ట్టుద‌ల ఆయ‌న‌లో క‌నిపిస్తోంద‌ని అంతా అనుకుంటున్నారు. పూరీ ప్లానింగ్ ని గ‌మ‌నిస్తున్న‌ ఫ్యాన్స్ ఈ సారి పూరీ ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకుని ప‌వ‌ర్ ఫుల్ కమ్ బ్యాక్ అవుతార‌ని భావిస్తున్నారు. మ‌రి ఫ్యాన్స్ అంతా భావిస్తున్న‌ట్టే విజ‌య్ సేతుప‌తి సినిమాతో స్ట్రాంగ్ గా క‌మ్ బ్యాక్ అవుతారా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News