ఏం చెప్పినా? చెసినా? కొత్త‌గానే పూరి జీ!

ఒక‌ప్పుడు పూరి జ‌గ‌న్నాధ్ అంటే? స్టార్ హీరోలే ముందుకొచ్చి సినిమాలు చేయ‌మ‌నే వారు. పూరి కోసం పోటీ ప‌డేవారు.;

Update: 2025-09-09 14:30 GMT

ఒక‌ప్పుడు పూరి జ‌గ‌న్నాధ్ అంటే? స్టార్ హీరోలే ముందుకొచ్చి సినిమాలు చేయ‌మ‌నే వారు. పూరి కోసం పోటీ ప‌డేవారు. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు. పూరి చేస్తాన‌న్నా? వాళ్లు రిజెక్ట్ కొట్టే ప‌రిస్థితి. మ‌ళ్లీ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయితే త‌ప్ప పూరి గ‌త వైభ‌వాన్ని అందుకోవ‌డం క‌ష్టం. ప్ర‌స్తుతం పూరి ఆ ప్ర‌య‌త్నా ల్లోనే బిజీగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో ప‌ర‌భాషా హీరోపై ఆధార‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుపతి హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ముంబైలో షూటింగ్ జ‌రుగుతోంది.

సేతుప‌తి న‌మ్మ‌కం నిల‌బ‌డేలా:

`బెగ్గ‌ర్` అనే టైటిల్ కూడా వినిపిస్తుంది. పూరి శైలికి భిన్న‌మైన కంటెంట్ కావ‌డంతోనే విజ‌య్ సేతుప‌తి కూడా ఒకే చేసాడు? అన్న‌ది తొలి నుంచి బ‌లంగా వినిపిస్తోన్న మాట‌. రెగ్యుల‌ర్ సినిమాలు..పాత్ర‌ల‌కు సేతుప‌తి తొలి నుంచి దూర‌మే. తాను ఎలాంటి సినిమా తీసినా? అందులో పాత్ర రిపీటెడ్ గా ఉండ కూడ‌ద‌న్న‌ది సేతుప‌తి నిబంధ‌న‌. కెరీర్ ఆరంభం నుంచి అలాంటి పాత్ర‌లే చేసుకుంటూ వ‌చ్చాడు కాబ‌ట్టే మార్కెట్ లో అంత బ‌లంగా నిల‌బ‌డ‌గ‌లిగాడు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును అన‌తి కాలంలోనే ద‌క్కించుకున్నాడు.

ఆ విష‌యంలో రాజీ ప‌డ‌ని పూరి:

పూరి క‌థ‌కు కూడా సేతుప‌తి క‌నెక్ట్ అవ్వ‌డానికి కార‌ణం ఆ కొత్త అంశ‌మే అన్న‌ది తొలి నుంచి వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని సేతుప‌తి కూడా ధృవీక‌రించాడు. పూరి గ‌త సినిమాలు..వాటి మేకింగ్ చూసి లాక్ అయిన‌ట్లు తెలిపాడు. కానీ ఈ చిత్రం మాత్రం వాటికి భిన్నంగా ఉంటుంద‌ని తాను కూడా అంతే బ‌లంగా న‌మ్ము తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం బ‌య‌ట‌కొచ్చింది. హీరో ప‌రిచ‌య స‌న్ని వేశం విష‌యంలో మాత్రం పూరి ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ట్రీట్ మెంట్ కొత్త‌గా ఉండాల్సిందే:

ఈ స‌న్నివేశం కోసం ఓ భారీ సెట్ కూడా వేసారుట‌. హీరోని ఇంట‌ర్ డ‌క్ష‌న్ సీన్ తో ఓ రేంజ్ లో లేపేలా? ఆ సెట్ స‌హ‌క‌రిస్తుంద‌ని చిత్ర బృందం భావిస్తోంది. ఇదే సెట్ లో మ‌రికొన్ని కీల‌క స‌న్నివేశాలు కూడా చిత్రీక రిస్తార‌ని చెబుతున్నారు. హీరో ప‌రిచ‌య స‌న్నివేశమైనా కొత్త‌గా ఉండాల్సిందే. గ‌తం త‌ర‌హాలో లాంచ్ చేస్తే మార్కెట్ లో అంగీక‌రించే ప‌రిస్థితి లేదు. స‌న్నివేశంలో కొత్త‌ద‌నం ఎక్క‌డుంద‌ని వెతికే ప‌రిస్థితి నేటిది. ఈ విష‌య‌యంలో ప్రేక్ష‌కులు ఎక్క‌డా రాజీ ప‌డ‌టం లేదు. పాత క‌థే అయినా కొత్త‌గా..త‌న ట్రీట్ మెంట్ ఎలా ఉంటుంది? అన్న దానికి ప్రేక్ష‌కులు పెద్ద పీట వేస్తున్నారు. పూరి వీట‌న్నింటిని గ్ర‌హించారా? లేదా? అన్న‌ది సినిమా రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంది.

Tags:    

Similar News