అప్పుడు తండ్రితో, ఇప్పుడు కొడుకు.. పూరి కొత్త ప్లాన్‌

ఇప్పటి వరకు పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ప్రముఖ సంగీత దర్శకులు వర్క్ చేశారు.;

Update: 2025-06-07 10:30 GMT

దర్శకుడు పూరి జగన్నాథ్‌ బ్యాక్ టు బ్యాక్ లైగర్‌, డబుల్ ఇస్మార్ట్‌ సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాడు. డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న పూరి జగన్నాథ్‌ మళ్లీ ఇప్పటి వరకు హిట్‌ కొట్టలేక పోయాడు. ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న పూరి తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే తమిళ్‌ స్టార్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా పూరి మూవీ కన్ఫర్మ్‌ అయింది. ఈ సినిమాలో టబు ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది. రాధిక ఆప్టే ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను స్వయంగా ఆమె ఖండించడం జరిగింది.

ఇప్పటి వరకు పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ప్రముఖ సంగీత దర్శకులు వర్క్ చేశారు. మణిశర్మతో పూరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇస్మార్ట్‌ శంకర్‌తో పాటు, డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీకి కూడా మణిశర్మ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా నిరాశ పరచినా కూడా మణిశర్మ మ్యూజిక్‌కి పాస్ మార్కులు పడ్డాయి. ఇప్పుడు పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న సినిమా కోసం సంగీత దర్శకుడిగా మహతి స్వర సాగర్‌ ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పూరి ఇతడిని ఎలా ఎంపిక చేశారు అంటూ ఆసక్తికరంగా కామెంట్‌ వినిపిస్తున్నాయి.

ఇస్మార్ట్‌ శంకర్‌కి అధికారికంగా సంగీతాన్ని మణిశర్మ అందించినప్పటికీ బ్యాక్ గ్రౌండ్‌లో వర్క్ చేసింది ఎక్కువగా మహతి స్వరసాగర్‌ అని సమాచారం. ఆ సమయంలోనే మహతి స్వర సాగర్‌ యొక్క వర్క్ తీరు నచ్చడంతో పూరి తన తాజా సినిమా బాధ్యతను అప్పగించి ఉంటాడు అనే టాక్‌ వినిపిస్తుంది. పూరి జగన్నాథ్‌కి ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా అత్యంత కీలకం. అందుకే ఈ సినిమా విషయంలో కచ్చితంగా సాహసాలు చేయడం లేదు అని చెప్పుకోవచ్చు. కానీ మహితి స్వర సాగర్‌ను ఎంపిక చేయడం మాత్రం కచ్చితంగా కొత్త ప్లాన్‌ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పూరి మూవీకి మణిరత్నం కంటే ఈ యువ సంగీత దర్శకుడు అయితే బెటర్‌ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరో వైపు మహతి స్వర సాగర్‌ ఈ మధ్య కాలంలో సంగీతాన్ని అందించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినా కూడా పూరి నమ్మకంతో తన సినిమా సంగీత బాధ్యతను అప్పగించడం బట్టి కచ్చితంగా చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఇదే ఏడాది చివరి వరకు సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో నివేదా థామస్‌ కీలక పాత్రలో నటించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను పూరి జగన్నాధ్‌ తో కలిసి ఛార్మి నిర్మిస్తున్న విషయం తెల్సిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News