స్మార్ట్ ఫోన్లో వచ్చే దానివల్లే యువతలో ఒత్తిడి పెరుగుతోందా.. పూరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Update: 2026-05-14 06:33 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన దర్శకత్వ మెళుకువలతో హీరోలను తన కథకు తగ్గట్టుగా వాడుకోవడంలో ఈయన తర్వాతే ఎవరైనా.. రవితేజ, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి వారి కెరీర్ కు మంచి పునాదులు వేశారు. ఇక అలాంటి ఈయన గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే . మరొకవైపు పూరీ మ్యూజింగ్స్ పేరిట ఒక పాడ్ కాస్ట్ నిర్వహిస్తూ అందులో ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు.

ముఖ్యంగా ఈ పాడ్ కాస్ట్ లో జీవిత సత్యాలు , సమాజం, మానసిక స్థితిగతులు, ఒత్తిడి , వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అంతేకాదు డిప్రెషన్, రిజెక్షన్, సైన్స్ బిలీఫ్, హవాలా , న్యూటన్ , సెక్సువల్ డిజైర్ వంటి విభిన్న అంశాలపై కూడా ఆయన తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల తాజా ఎపిసోడ్లలో డిప్రెషన్ వల్ల మంచి లాభాలు ఉన్నాయి అంటూ.. డిప్రెషన్ ను ఒక అవకాశం గా మార్చుకోవాలని చెప్పిన పూరీ జగన్నాథ్ నిన్నటికి నిన్న "సైన్స్ వర్సెస్ బిలీఫ్" పేరిట నమ్మకం కథల నుండి పుడితే.. సైన్సు నిజాన్ని చెబుతుంది అంటూ కూడా వివరించారు. అయితే ఇప్పుడు యువత గురించి కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు పూరీ జగన్నాథ్.

తాజా ఎపిసోడ్ లో భాగంగా సెల్ ఫోన్ వాడకంపై అలాగే సెల్ ఫోన్ లో వచ్చే నోటిఫికేషన్ వల్ల యువత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కూడా తెలిపారు పూరీ జగన్నాథ్. ఆయన మాట్లాడుతూ ..శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ సమతుల్యతపై ఈ విధంగా కామెంట్లు చేశారు." ఒత్తిడి సమయంలో విడుదల ఈ హార్మోన్ ప్రమాదకర పరిస్థితులలో మనల్ని మరింత అప్రమత్తం చేస్తుంది. అయితే ఈ కార్టిసాల్ హార్మోన్ విడుదల ఎక్కువ అయితే మాత్రం నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్ వల్ల అనవసరంగా ఈ కార్టిసాల్ పెరిగి.. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది అంటూ తెలిపారు. సెల్ ఫోన్ కాసేపు పక్కన పెట్టిన సరే దాంట్లో వచ్చే నోటిఫికేషన్ వల్ల యువతలో ఒత్తిడి పెరుగుతోందని వీలైనంతవరకు నోటిఫికేషన్ రాకుండా తగ్గించుకోవడం లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం మంచిది అంటూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పూరి జగన్నాథ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక పూరీ జగన్నాథ్ విషయానికొస్తే.. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ అనే సినిమా చేస్తున్నారు.పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ , చార్మి కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి, టబు, సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక యాచకుడి పాత్రలో రగ్గడ్ లుక్కులో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తయి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో కొనసాగుతోంది. అయితే ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ల నుండి అడ్డంకులు ఎదురవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఈయన చేసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్ గా మిగలడంతో ఈ సినిమా విడుదలకు కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు విజయ్ సేతుపతి మాత్రం పూరి జగన్నాథ్ 26 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఈ సినిమా ఒక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News