ఒక్క పాట.. 14 ఏళ్లుగా డబ్బులే డబ్బులు!
ఒక సాంగ్ హిట్ అయితే కొన్ని రోజులు, కొన్ని నెలలు.. మహా అయితే ఒకట్రెండు సంవత్సరాలు ఆదరణ ఉంటుంది.
ఒక సాంగ్ హిట్ అయితే కొన్ని రోజులు, కొన్ని నెలలు.. మహా అయితే ఒకట్రెండు సంవత్సరాలు ఆదరణ ఉంటుంది. ఆ తర్వాత కొత్త సాంగ్స్, కొత్త ట్రెండ్స్ రావడంతో పాత హిట్లు వెనక్కి వెళ్లిపోతాయి. కానీ కొన్ని పాటలు మాత్రం కాలంతో పోటీ పడుతూ తమ క్రేజ్‌ను కొనసాగిస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది సౌత్ కొరియన్ సింగర్ PSY పాడిన గంగ్నమ్ స్టైల్ సాంగ్. 2012లో రిలీజైన ఈ సాంగ్ తాజాగా యూట్యూబ్‌లో 6 బిలియన్ వ్యూస్ మైలురాయిని అందుకుంది. సాంగ్ రిలీజై దాదాపు 14 ఏళ్లు గడిచినా వ్యూస్ రావడం ఆగకపోవడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
గంగ్నమ్ స్టైల్ కేవలం ఓ వైరల్ సాంగ్ కాదు, డిజిటల్ యుగంలో ఒక సాంగ్ కు ఉండే లాంగ్ టెయిల్ రెవెన్యూ కు బెస్ట్ ఎగ్జాంపుల్. 2012లో వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ వీడియో అదే ఏడాది యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి వీడియోగా రికార్డు సృష్టించింది. అప్పట్లో రోజుకు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో యూట్యూబ్ యాడ్స్ ద్వారా ఈ సాంగ్ ఎంత ఆదాయం అందుకుందనే విషయం కూడా హాట్ టాపిక్‌గా మారింది.
2013లో గూగుల్ వెల్లడించిన వివరాల ప్రకారం, దాదాపు 1.2 బిలియన్ వ్యూస్ దశలోనే గంగ్నమ్ స్టైల్ సాంగ్‌కు సంబంధించిన యూట్యూబ్ పేజీ $8 మిలియన్లకు పైగా యాడ్ రెవెన్యూ సంపాదించినట్టు చెప్పింది. అయితే ఇది PSY పర్సనల్ గా అందుకున్న రెవిన్యూ కాదని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం 6 బిలియన్ వ్యూస్ దాటిన నేపథ్యంలో యాడ్ రేట్లను బట్టి హక్కుదారులకు యూట్యూబ్ యాడ్స్ ద్వారా కోట్ల డాలర్ల ఆదాయం వచ్చి ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయం డబ్బు కంటే కూడా పాత కంటెంట్ కొత్త ఆదాయంగా మారడం. ఒకప్పుడు సాంగ్స్ ద్వారా ప్రధానంగా ఆల్బమ్ సేల్స్, రేడియో, టీవీ, కచేరీలే ఆదాయ మార్గాలుగా ఉండేవి. ఇప్పుడు యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఒక సాంగ్ సంవత్సరాల తర్వాత కూడా కొత్త ప్రేక్షకులను సంపాదించగలదు. అదే టైమ్ లో యాడ్స్, స్ట్రీమింగ్, లైసెన్సింగ్, కవర్స్, కంటెంట్ ఐడీ వంటి మార్గాలు ఆ సాంగ్ వాల్యూని కంటిన్యూ చేస్తాయ. అందుకే గంగ్నమ్ స్టైల్ సాంగ్ 14 ఏళ్ల తర్వాత కూడా కేవలం పాత హిట్‌గా కాకుండా.. ఒక్కసారి సృష్టించిన కంటెంట్‌ను సంవత్సరాల పాటు ఆదాయాన్ని తెచ్చే డిజిటల్ ఆస్తిగా మార్చుకోవచ్చని ప్రూవ్ చేసిన ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది.