పిక్ ఆఫ్ ది డే.. పవన్ ను కలిసిన నిర్మాత రామ్.. కారణం?

మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను నిర్మాత రామ్ తాళ్లూరి ఎందుకు కలిశారు? వీరిద్దరి కాంబినేషన్లో ఏదైనా కొత్త సినిమా వస్తోందా? లేక మరేదైనా కారణం ఉందా?అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.;

Update: 2025-10-16 06:41 GMT

అప్పుడప్పుడు ఇద్దరు వ్యక్తుల కలయిక అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఆ కలయికకు సంబంధించిన ఫోటోలు బయటకు వస్తే మాత్రం పిక్ ఆఫ్ ది డే అంటూ నెటిజన్స్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ డీసీఎంగా ఒకవైపు బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న పవన్ కళ్యాణ్ ను తాజాగా యంగ్ హీరో రామ్ తాళ్లూరి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ పిక్ ఆఫ్ ది డే అంటూ ప్రచారం చేస్తున్నారు.

మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను నిర్మాత రామ్ తాళ్లూరి ఎందుకు కలిశారు? వీరిద్దరి కాంబినేషన్లో ఏదైనా కొత్త సినిమా వస్తోందా? లేక మరేదైనా కారణం ఉందా?అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. అందులో భాగంగానే టాలీవుడ్ నిర్మాత రామ్ తాళ్లూరి పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ ను కలిసి వచ్చిన తర్వాత నిన్న రాత్రి ఎక్స్ వేదికగా నిర్మాత ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ.. "జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ సార్ కి ధన్యవాదాలు. ఈరోజు అధికారికంగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నాను. మీ దార్శనిక న్యాయకత్వంలో పార్టీని నిర్మించడంలో.. ప్రజల కోసం పనిచేయడంలో నా వంతు కృషి చేస్తాను" అంటూ రామ్ తాళ్లూరి ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈ ట్వీట్ లో రామ్ పంచుకున్న ఫోటోలలో అటు పవన్ కళ్యాణ్ ఇటు రామ్ ఇద్దరు వైట్ షర్టులో చాలా హుందాగా కనిపిస్తున్నారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు నిర్మాత రామ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రామ్ తాళ్లూరి విషయానికి వస్తే.. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 2016లో ఆది హీరోగా వచ్చిన 'చుట్టాలబ్బాయిని' అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత దండుపాళ్యం అనే కన్నడ భాషా క్రైమ్ థ్రిల్లర్ ని కూడా నిర్మించారు. రవితేజ హీరోగా నటించిన నేల టికెట్, డిస్కో రాజా చిత్రాలను నిర్మించిన ఈయన.. వరుణ్ తేజ్ తో మట్కా, విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ వంటి చిత్రాలను నిర్మించారు. అలాగే కిన్నెరసాని చిత్రానికి కూడా ఈయనే నిర్మాత కావడం గమనార్హం. ఇకపోతే తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్ భాషలలో కూడా సినిమాలు నిర్మించి ప్రేక్షకులను ఆకట్టుకున్న రామ్ 2007లో విడుదలైన తమిళ చిత్రం రమణకు రీమేక్ అయిన బెంగాలీ చిత్రం టైగర్ ని కూడా ఈయనే నిర్మించారు..

2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కి, జనసేనకు బలమైన మద్దతుదారుడిగా నిలిచిన రామ్ ఇప్పుడు జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి కూడా రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే ఈ సినిమాపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు.

Tags:    

Similar News