జేమ్స్ బాండ్ బ్యూటీలా ప్రియా వారియర్
ప్రియా వారియర్ కెరీర్ లో ఇప్పుడెంత బిజీగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. సౌత్ సినిమాలు కూడా కాదు. ఏకంగా బాలీవుడ్ సినిమాలే చేస్తోంది.;
ప్రియా వారియర్ కెరీర్ లో ఇప్పుడెంత బిజీగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. సౌత్ సినిమాలు కూడా కాదు. ఏకంగా బాలీవుడ్ సినిమాలే చేస్తోంది. ప్రస్తుతం అమ్మడి లైనప్ లో చాలా సినిమాలున్నాయి. వచ్చిన ఏ అవకాశం విడిచిపెట్టలేదు. అలాగని సౌత్ ని లైట్ తీసుకోలేదు. ఇక్కడా అందివచ్చిన అవకాశాలు అందు కుంటుంది. కానీ అమ్మడి టార్గెట్ మాత్రం హిందీ ఇండస్ట్రీపైనే కనిపిస్తుంది.
అక్కడ మార్కెట్ లో ఎలాగైనా నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈరకమైన జీవితాన్ని ప్రియావారియర్ ఊహించిందా? అసలు తాన స్టార్ అవుతానని కలలోనైనా అనుకుందా? అంటే లేదనే చెప్పాలి. ఈ మాట స్వయంగా ప్రియావారియర్ చెప్పింది. అలా అమ్మడి కెరీర్ దేదీప్యమానంగా సాగిపో తుంది. ఇంత ఫేమస్ అవ్వడానికి కారణమైన బ్యూటీ సోషల్ మీడియాని ఎలా వదిలేస్తుంది.
అందుకే ఎప్పటికప్పుడు సొగసరి కొత్త ఫోటోలతో కుర్రకారులో జోష్ నింపుతుంది. స్టైలింగ్ లో తనని కొట్టే వారు లేరు అన్న రేంజ్ లో సెగలు పుట్టించే భంగిమలతో ఆకట్టుకుంటుంది. తాజాగా ప్రియావారియర్ సిరీస్ నుంచి కొత్త ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ఇదిగో ఇక్కడిలా వారియర్ బ్యూటీ మంటలు పుట్టిస్తుంది.
కన్నాల బనియన్ పై బ్లాక్ లెదర్ జాకెట్ లోనే ఎంతో స్టైలిష్ గా ముస్తాబైంది. అమ్మడు డ్రెస్ మ్యాచింగ్ చేతులకు గ్లౌస్ ధరించి వావ్ అనిపిస్తుంది. ఇక ప్రియ మ్యాకప్ గురించి చెప్పేదేముంది? అమ్మడి మ్యాకప్ సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంటుంది. మ్యాకప్ సహా అమ్మడు ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ ప్రతీది మరింత అందంగా తీర్చి దిద్దాయి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.