పీసీ పెంగ్విన్ లుక్ మెంట‌ల్

వజ్రాలతో రూపొందించిన ఈ నెక్లెస్ సంపూర్ణ స్వచ్ఛతతో ఆశ్చర్యపరిచేవిధంగా రూపొందింద‌ని డిజైన‌ర్లు చెబుతున్నారు.

Update: 2024-05-22 20:06 GMT

గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ప్రియాంకచోప్రా అసాధారణమైన లుక్స్ అన్నివేళ‌లా చ‌ర్చ‌నీయాంశం. ఇప్పుడు సెర్పెంటి ఏటర్నా నెక్లెస్‌లో ధ‌గ‌ధ‌గా మెరిసిపోయారు. ఇది ప్ర‌ఖ్యాత బ‌ల్గారీ ఆభరణాలచే రూపొందించిన అత్యంత విలువైన కళాకృతి. ఈ అద్భుతమైన నెక్లెస్‌ని పూర్తి చేయడానికి 2,800 గంటల సమయం పట్టింది. వజ్రాలతో రూపొందించిన ఈ నెక్లెస్ సంపూర్ణ స్వచ్ఛతతో ఆశ్చర్యపరిచేవిధంగా రూపొందింద‌ని డిజైన‌ర్లు చెబుతున్నారు.


ఇదిలా ఉంటే, ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆభ‌ర‌ణంతో పాటు, ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన ఆ గౌన్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ గౌన్ నిజానికి ఎంతో ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్.. ఇది ఒక పెంగ్విన్ ని పోలి ఉంద‌ని అభిమానులు పోలిక‌లు చెబుతున్నారు. త‌న భుజాల మీదుగా రెండు చీలిక‌లు వేలాడుతుంటే అవి పెంగ్విన్ రెక్క‌ల‌ను త‌ల‌పించాయ‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ఇక‌ పీసీ ఈ ప్ర‌త్యేక‌మైన గౌన్ లో... ఖ‌రీదైన వ‌జ్రాభ‌ర‌ణంతో ధ‌గ‌ధ‌గా మెరిసిపోయింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.


రోమ్‌లో జరిగిన బల్గారీ 140వ వార్షికోత్సవ గాలా డిన్నర్ లో ప్రియాంక‌తో పాటు, వినోద పరిశ్రమలోని కొంద‌రు పెద్ద స్టార్లు సంద‌డి చేసారు. వీరంతా ప్రఖ్యాత ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్‌- బ‌ల్గారీకి ప్రపంచ రాయబారిగా ఉన్నారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖులలో ప్రియాంక చోప్రా, అన్నే హాత్వే, షు క్వి, లియు యిఫీ ఉన్నారు. మనంద‌రి ఫేవ‌రెట్ దేశీ గాళ్‌ ప్రియాంక చోప్రా దిగ్గజ న‌టి అన్నే హాత్వేతో కొన్ని అద్భుతమైన క్షణాలకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి. ఆ ఇద్దరు నటీమణులు కలుసుకోవడం ఇదే మొదటిసారి కాదు.. బల్గారీ అంబాసిడర్‌లుగా తమ భాగస్వామ్య పాత్ర కారణంగా అనేక సందర్భాల్లో క‌లిసి ఒకే వేదిక‌పై క‌నిపించారు. ఇద్దరూ 2022లో పారిస్‌లో బ్లాక్‌పింక్ సభ్యురాలు లిసాతో కలిసి క‌నిపించారు. ఆపై 2023లో జెండయా కూడా వారితో కలిసి క‌నిపించింది.

Tags:    

Similar News