మెగా ఫ్యాన్స్ నే నమ్ముకున్న హీరోయిన్..!
నాని గ్యాంగ్ లీడర్ తో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక తమిళ్ లో శివ కార్తికేయన్ తో డాక్టర్, డాన్ లు సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది;
చెన్నై చిన్నది ప్రియాంక అరుల్ మోహన్ కెరీర్ కన్ ఫ్యూజన్ లో పడింది. నాని గ్యాంగ్ లీడర్ తో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక తమిళ్ లో శివ కార్తికేయన్ తో డాక్టర్, డాన్ లు సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత సూర్య తో కూడా ఛాన్స్ అందుకుంది అమ్మడు. ఐతే ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో అమ్మడి గ్రాఫ్ పడిపోయింది. ఐతే మళ్లీ తెలుగులో నానితో సరిపోదా శనివారం తో సక్సెస్ వచ్చింది.
ఆ సక్సెస్ వచ్చినా కూడా ప్రియాంక మోహన్ కెరీర్ స్పీడ్ అందుకోలేదు. ఐతే ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఓజీ గ్లింప్స్ తోనే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచాడు సుజిత్. ఐతే ఈ సినిమాతో ప్రియాంక ఫేట్ కూడా మారుతుందని నమ్ముతుంది.
తమిళ్ లో హిట్లు పడినా ఎందుకో అమ్మడికి కమర్షియల్ హీరోయిన్ గా పేరు రాలేదు. అందుకే పవర్ స్టార్ తో ఓజీ సినిమాతో పవర్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది అమ్మడు. ఈ మూవీతో సక్సెస్ రావాలంటే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆమెను ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా సినిమాతో ప్రియాంక సక్సెస్ అందుకునే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయి.
పవర్ స్టార్ తో సుజిత్ తీస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ. సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ లాక్ చేశారు. ఓజీ సినిమా హిట్ పడితే మాత్రం ప్రియాంకాకు తెలుగులో మరికొన్ని ఛాన్స్ లు వస్తాయి. ఓజీలో ప్రియాంక ఎలాంటి పాత్రలో నటిస్తుంది. పవన్ తో డ్యుయెట్స్ ఉంటాయా లాంటి విషయాలు తెలియాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ సినిమాలో నటించింది కాబట్టి టాలీవుడ్ లో ప్రియాంకాకు స్టార్ క్రేజ్ వచ్చినట్టే లెక్క. ఐతే ఓజీ సూపర్ హిట్ పడితే మాత్రం అమ్మడికి లెక్కకు మించి ఛాన్స్ లు వస్తాయి. మరి ఈ హీరోయిన్ ని సుజిత్ ఎలా చూపించనున్నాడు అన్నది చూడాలి. ప్రియాంకా మాత్రం మెగా ఫ్యాన్స్ పైనే భారమంతా వేసి ఉంది. సినిమాకు తను పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టేసిన అమ్మడు ఇక రిజల్ట్ ఎలా ఉంటుందో అని సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంది. అది తెలియాలంటే ఈ ఇయర్ దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.