బుల్లితెర‌పై కొత్త 'నాగిని' బుస‌బుస‌లు

బుల్లితెర‌పై `నాగిన్` సీరియ‌ల్ దేశ‌వ్యాప్తంగా ఎంతగా పాపులారిటీ ద‌క్కించుకుందో తెలిసిందే;

Update: 2025-11-03 21:30 GMT

బుల్లితెర‌పై `నాగిన్` సీరియ‌ల్ దేశ‌వ్యాప్తంగా ఎంతగా పాపులారిటీ ద‌క్కించుకుందో తెలిసిందే. బాలాజీ టెలీఫిలింస్- క‌ల‌ర్ చాన‌ల్ సంయుక్త నిర్మాణంలో ఈ సిరీస్ దాదాపు ఆరు సీజ‌న్లుగా గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది.

2015 నుండి విజ‌య‌వంతంగా నడుస్తున్న నాగిన్ ఫ్రాంచైజ్ లో ప‌లువురు తార‌లు మారారు. టైటిల్ పాత్ర‌లో మౌని రాయ్, అదా ఖాన్, తేజస్వి ప్రకాష్ వంటి బుల్లితెర క్వీన్స్ త‌మ ప్ర‌తిభ‌తో మెప్పించారు. అయితే ఈసారి నాగిన్ పాత్ర‌లోకి బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా ప‌టానీ అడుగుపెడుతుంద‌ని కొన్ని గుసగుస‌లు వినిపించినా కానీ, అది జ‌ర‌గ‌లేదు.

అయితే ఇటీవ‌ల బిగ్ బాస్ 16 షోలో ఏక్తాక‌పూర్ త‌దుప‌రి నాగిన్ పాత్ర‌ధారి గురించి ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. చాలా పేర్లు ప‌రిశీలించిన త‌ర్వాత ప్రియాంక ఇప్పుడు పదవ సంవత్సరం, ఏడవ సీజన్‌లోకి ప్రియాంక అడుగుపెడుతోంది. ఏక్తాకపూర్ బాలాజీ టెలిఫిల్మ్స్- కలర్స్‌కు ఇది ఒక ప్రధాన మైలురాయిగా భావిస్తున్నారు.

ఏక్తా ఇంత‌కుముందు బిగ్ బాస్ లో ప్రియాంకను సరైన ఎంపికగా భావిస్తున్న‌ట్లు హింట్ ఇచ్చిన త‌ర్వాత ఇప్పుడు అధికారిక ప్రకటన కూడా వెలువ‌డింది. ఈ క్రేజీ సీరియ‌ల్ న‌టిగా ప్రియాంక‌ త‌న‌ను తాను ఎలివేట్ చేసుకోవ‌డానికి ఆస్కారం క‌ల్పిస్తుంది. ఫాంటసీ డ్రామా, యాక్షన్, కుట్ర‌లు కుతంత్రాల‌తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే సీరియ‌ల్‌లో త‌న పాత్ర‌కు హావ‌భావాల‌ను ప‌లికించేందుకు ఆస్కారం ఉంది. `నాగిన్- 7` ప్రీమియర్ తేదీ, పూర్తి తారాగణం సహా ఇత‌ర వివ‌రాలు త్వరలో ప్ర‌క‌టించే అవకాశం ఉంది.

ప్రియాంక చాహర్ చౌదరి `బిగ్ బాస్ 16` తర్వాత భారీ ఫాలోవ‌ర్స్ ని సంపాదించారు. ఈ నటి ఇప్పుడు అధికారికంగా నాగిన్ 7 కొత్త ముఖంగా పట్టాభిషేకం అందుకుంది. ప్రియాంక‌ ప్రయాణం బిగ్ బాస్ వేదికపైనే అసాధార‌ణంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె అభిమానులు శుభాకాంక్ష‌లు తెలిపారు.



Tags:    

Similar News