ఓజి ప్రియాంక కెరీర్ ను మ‌లుపు తిప్పుతుందా?

హీరోయిన్ల‌కు అంద‌మొక్క‌టే స‌క్సెస్ ను అందించ‌దు. ఆ స‌క్సెస్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది.;

Update: 2025-09-23 11:30 GMT

హీరోయిన్ల‌కు అంద‌మొక్క‌టే స‌క్సెస్ ను అందించ‌దు. ఆ స‌క్సెస్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. అందంతో పాటూ, తెలివి, న‌ట‌న అన్నింటికంటే ముఖ్య‌మైన‌ది స‌రైన క‌థ‌ల‌ను ఎంపిక చేసుకోవ‌డం. ఇవ‌న్నీ స‌క్సెస్ కు మెయిన్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ వ‌ల్లే ఎంతో మంది హీరోయిన్లు కెరీర్లో సూప‌ర్ స‌క్సెస్ అవ‌గా, మ‌రికొంద‌రు అందం, ప్ర‌తిభ ఉండి కూడా వెనుక‌బ‌డి పోతున్నారు.

టాలెంట్ ఉన్నా స‌క్సెస్ రేట్ చాలా త‌క్కువ‌

అందులో ప్రియాంక అరుళ్ మోహ‌న్ ఒక‌రు. త‌న అందంతో ఎంతో మంది యూత్ ను ఎట్రాక్ట్ చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్ప‌ర‌చుకున్నారు ప్రియాంక‌. ఆన్ స్క్రీన్ మాత్ర‌మే కాకుండా ఆమె ఆఫ్ లైన్ లో కూడా ప్రియాంక ఉండే విధానం, ప్ర‌వ‌ర్తించే తీరు చాలా మందిని మెప్పించి, ఆమెకు ఎక్కువ మందిని ద‌గ్గ‌ర‌కు చేసింది. అయితే ఎంత అందమున్నా, ఫ్యాన్స్ ఉన్నా ప్రియాంక‌కు స‌క్సెస్ రేట్ చాలా త‌క్కువ‌నేది ఒప్పుకోవాల్సిన వాస్త‌వం.

మొద‌టి భారీ సినిమా ఓజినీ..

అలాంటి ప్రియాంక‌కు ఇప్పుడు ఓ భారీ అవకాశం ఓజి రూపంలో ద‌క్కింది. ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్ లో మిడ్ రేంజ్ సినిమాల్లోనే న‌టించిన ప్రియాంక‌కు ఓజి సినిమానే మొద‌టి భారీ బ‌డ్జెట్ సినిమా. అందులోనూ ఆమె ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న జోడీగా న‌టించ‌డ‌మంటే ప్రియాంక‌కు అది గోల్డెన్ ఛాన్సే. ఓజిలో ఓజాస్ గంభీర భార్య క‌న్మ‌ణి పాత్ర‌లో ప్రియాంక క‌నిపించ‌నున్నారు.

ఓజిలో క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో

సినిమాలో ఆమె క్యారెక్ట‌ర్ నిడివి మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌క‌పోయినా సినిమాలో త‌న క్యారెక్ట‌ర్ చాలా కీల‌క‌మని ప్రియాంక మొద‌టి నుంచే చెప్పుకుంటూ వ‌స్తున్నారు. పైగా ట్రైల‌ర్ చూశాక ఆ విష‌యం నిజ‌మ‌ని కూడా అర్థ‌మైంది. సినిమాకు ఎంతో కీల‌క‌మైన ఫ్యామిలీ డ్రామాలో ప్రియాంక క్యారెక్ట‌ర్ కీల‌కంగా ఉంటుంద‌ని, త‌న క్యారెక్ట‌రే సినిమాను మ‌లుపు తిప్పుతుంద‌ని ఇప్ప‌టికే ప్రియాంక చెప్పారు. అందుకే ఓజి సినిమా త‌న కెరీర్ ను మ‌లుపు తిప్పే ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని ప్రియాంక ఈ సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఓజి సినిమా హిట్టై త‌న క్యారెక్ట‌ర్ కు మంచి మార్కులు ప‌డితే మాత్రం ప్రియాంక‌కు మ‌రిన్ని స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు ద‌క్కే అవ‌కాశముంది.

Tags:    

Similar News