• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ్యాడ్ స్క్వేర్‌‌ లో...

మ్యాడ్ స్క్వేర్‌‌ లో గ్లామర్ డోస్.. రంగంలోకి క్యూట్ హీరోయిన్

| దీంతో ఈ సినిమా ఫుల్ రన్‌లో భారీ కలెక్షన్లనే రాబట్టింది.

By - Tupaki Desk
Update: 2024-11-08 08:51 GMT

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాకు మొదట్లోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ సినిమా ఫుల్ రన్‌లో భారీ కలెక్షన్లనే రాబట్టింది. తద్వారా కొన్ని కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.


ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగంలో కనిపించిన ముగ్గురు హీరోలు ఇందులో కూడా ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై హైప్ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఫలితంగా ఈ మూవీని మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కిస్తున్నారు.

‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాపై అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో దీన్ని మరింత ఎక్కువ ఫన్‌తో తీయాలని దర్శకుడు కల్యాణ్ శంకర్ డిసైడ్ అయిపోయాడు. అంతేకాదు, గతంలో వచ్చిన ఫస్ట్ పార్టులో తగ్గిన గ్లామర్‌ను ఇందులో తగ్గకుండా అతడు ఓ క్రేజీ ఐడియాను అమలు చేయబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ చిత్రం కోసం గ్లామరస్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్‌ను తీసుకున్నారని తెలుస్తోంది.

‘మ్యాడ్’ మూవీలో గౌరీ ప్రియ, అననతిక సనీల్‌కుమార్, గోపికా ఉదయన్‌‌లు హీరోయిన్లుగా నటించారు. కానీ, వీళ్లెవరూ పెద్దగా గ్లామర్ టచ్‌ను అందించలేకపోయారు అని టాక్ వచ్చింది. అందుకే ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం ప్రియాంక జవాల్కర్‌ను రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది. అయితే, ఇందులో ఆమె హీరోయిన్ పాత్రను చేయడం లేదట. కానీ, ఎంతో ముఖ్యమైన ఓ రోల్‌లో కనిపిస్తుందని సమాచారం.

ప్రియాంక జవాల్కర్ ఇప్పటికే ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ షూటింగ్‌లో పాల్గొందని తెలిసింది. ఆమెపై కొన్ని క్రేజీ సీన్స్‌తో పాటు ఓ డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేసినట్లు ఫిలిం నగర్ ఏరియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, మరో 15 రోజుల పాటు జరగనున్న షెడ్యూల్‌లో ప్రియాంక జవాల్కర్‌పై ఓ సాంగ్‌ను కూడా షూట్ చేయనున్నారని తెలిసింది. సినిమాలో ఈ క్యారెక్టర్ స్పెషల్ గా ఉండనున్నట్లు అర్ధమవుతుంది. ప్రియాంక 2021లో ట్యాక్సీ వాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ సమర్పణలో సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం ఇస్తున్నాడు.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Mad 
  • Sequel 
  • Madsquare 
  • Sangeethsobhan 
  • Narnenithin 
  • Ramnithin 
  • Ananya 
  • Gopikaudhayan 
  • Gowripriya 
  • Kalyanshankar 
  • NewHeroine 
  • Priyankajawalkar 
  • Nagavamsi 
  • Saisowjanya 
  • Sitaraentertainments 

Similar News

సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం రష్మిక స్పెషల్ ట్రైనింగ్!

2026-11-23 07:04 GMT

హీరోయిన్‌కు సారీ చెప్పిన ‘భోగి’ డైరెక్టర్.. కారణం ఇదే!

2026-11-23 07:03 GMT

చివరి నిమిషం ఆలస్యం ఎంతవరకు కరెక్ట్‌?

2026-11-23 07:02 GMT

వైట్ అవుట్‌ఫిట్‌లో హాట్ ట్రీట్ ఇస్తున్న ఆయిషా శర్మ!

2026-11-23 05:46 GMT

పాన్ ఇండియా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫార్ములా ఏంటి? ఎలాంటి సినిమాలు వస్తే హిట్ అవుతున్నాయి...

2026-11-23 05:46 GMT

దేవ‌ర‌కొండ‌ ప్రేమను క‌ళ్ల‌లోనే చూస్తోన్న ర‌ష్మిక‌

2026-11-23 04:56 GMT

శర్వా కెరీర్‌ను మార్చే సినిమానా..

2026-11-23 04:55 GMT

కెరీర్ పోయినా తలవంచకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా!

2026-11-23 04:37 GMT

మాల్దీవుల్లో నేహా శర్మ బర్త్ డే సెలబ్రేషన్స్!

2026-11-23 04:37 GMT

ఔత్సాహిక సినీర‌చ‌యిత‌లు ఈ దిగ్గ‌జాల నుంచి నేర్చుకోవాల్సిన‌వి!

2026-11-23 04:37 GMT

స్టాక్ మార్కెట్లో IPOకి వెళుతున్న అగ్ర నిర్మాణ సంస్థ?

2026-11-23 03:59 GMT

నిర్మాత ఆఫీస్‌కి వేరొక క‌థ విన‌డానికి వెళ్లి అలా లాక్ అయిపోయింద‌ట‌

2026-11-23 03:56 GMT

Copyright @2026

Powered by Blink CMS