పిక్‌టాక్ : జలకాలాటలో ప్రియాంక చోప్రా

ఆ అందంను కాపాడుకునేందుకు ప్రియాంక చోప్రా రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా స్విమ్మింగ్‌ చేస్తూ ఉంటుంది.;

Update: 2025-04-26 22:30 GMT

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి హైదరాబాద్ వచ్చింది. మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్‌ కోసం ఆ మధ్య హైదరాబాద్‌కి వచ్చిన ప్రియాంక చోప్రా మరోసారి షూటింగ్ కోసం హైదరాబాద్‌ వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో స్విమ్మింగ్‌ పూల్‌లో దిగిన ఫోటోలను షేర్‌ చేసింది. ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్‌ చేసిన ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ప్రియాంక చోప్రా సొంతం అంటూ అభిమానులు అంటూ ఉంటారు. ఆ అందంను కాపాడుకునేందుకు ప్రియాంక చోప్రా రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా స్విమ్మింగ్‌ చేస్తూ ఉంటుంది.

తాజాగా హైదరాబాద్‌లో స్విమ్మింగ్‌ చేసిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. ఎల్లో బికినీ ధరించిన ప్రియాంక చోప్రా జల కన్య మాదిరిగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఇండియన్‌ హీరోయిన్గా నిలిచిన విషయం తెల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రాకి 92.5 మిలియన్‌ ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. ఈ స్థాయి ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా అందుకు తగ్గట్లుగా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు, తన డైలీ రొటీన్‌ను సైతం షేర్‌ చేస్తూ ఉంటుంది. ప్రియాంక చోప్రా తాజా ఫోటోలకు లక్షల మంది లైక్ చేశారు.

బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కి షిప్ట్‌ అయింది. అక్కడ ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్‌లతో బిజీగా మారింది. ఇటీవల వచ్చిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌తో హాలీవుడ్‌లో ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది. అందుకు తగ్గట్లుగానే ఈమె పారితోషికం పెంచింది. చాలా ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. అది కూడా రాజమౌళి, మహేష్ బాబు సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించబోతుందా అనేది క్లారిటీ రాలేదు. సినిమాలోని ముఖ్య పాత్రలో ఆమె కనిపించబోతుందని సమాచారం అందుతోంది. ఆ విషయమై ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉంది.

మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా కోసం ప్రియాంక చోప్రా అత్యధిక డేట్లు ఇచ్చిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు ఇవ్వనన్ని డేట్లను ప్రియాంక చోప్రా ఇచ్చిందట. ఆ విషయాన్ని పక్కన పెడితే క్రిష్ సిరీస్‌లో రాబోతున్న కొత్త సినిమాలో కూడా ప్రియాంక చోప్రా నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో హృతిక్ రోషన్‌తో కలిసి ఈమె నటించింది. మరోసారి ఈమె నటించేందుకు రెడీ అవుతోంది. క్రిష్ ప్రాంచైజీ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో ప్రియాంక చోప్రా కూడా ఉంటే కచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో సినిమాకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మేకర్స్ ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటారని అంటున్నారు. క్రిష్ లో ప్రియాంక చోప్రా నటించే విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News