హ‌బ్బీతో పూల్ సైడ్ ప్రియాంక చోప్రా ఫుల్ జాలీగా

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ... మ‌రోవైపు సోషల్ మీడియాలోను గుబులు పుట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-08-17 23:30 GMT

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ... మ‌రోవైపు సోషల్ మీడియాలోను గుబులు పుట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ స‌ర‌స‌న వార‌ణాసిలో న‌టిస్తున్న ప్రియాంక చోప్రా, ఇటీవ‌లే గ్లాడియేట‌ర్ ఫేం ర‌సెల్ క్రో స‌ర‌స‌న న‌టిస్తున్న విష‌యాన్ని రివీల్ చేసారు. పీసీ సామాజిక మాధ్య‌మాల్లో రివీల్ చేసే ప్రతి పోస్ట్ అభిమానుల్లో విశేష ఆదరణ పొందుతుంది. ఈ అప్ డేట్ ల‌తో పాటు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేడెక్కించే ఫోటోషూట్స్ తోను అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పేసుకుంటోంది. లేటెస్ట్ గా `సమ్మర్ డంప్` పేరు రిలీజ్ చేసిన‌ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.




ప్రపంచమంతా విస్తృతంగా ప్రయాణించిన తర్వాత కాసేపు ఇంటికి చేరుకున్నానంటూ.. తన వ్యక్తిగత -వృత్తిగత జీవితానికి సంబంధించిన క్షణాలను ఫోటోల రూపంలో పీసీ షేర్ చేయ‌గా దానికి నెటిజ‌నుల నుంచి అద్భుత స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. ఈ పోస్ట్‌లో తన కుమార్తె మేల్తీ మేరీ, కుటుంబ సభ్యులు.. ప్రాణస్నేహితుడు జో జోనాస్ గురించి ప్ర‌స్థావించింది.




ఈ ఫోటోల సిరీస్‌లో భ‌ర్త పూల్ లో జ‌ల‌కాలాడుతున్న వీడియోను కూడా పీసీ షేర్ చేసారు. పీసీ దూరంగా అత‌డిని కెమెరాలో క‌వ‌ర్ చేసింద‌ని అర్థ‌మ‌వుతోంది. దీనికి తోడు మాల్తీ మేరీ విశేషాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిన్నారి మాల్తీ ఎంతో ఇష్టంగా ఇడ్లీలు తినడం... విమానం కాక్‌పిట్‌లో పైలట్ బటన్లను ఆశ్చర్యంగా చూడటం నెటిజన్లకు ముచ్చట గొలుపుతోంది. అంతేకాకుండా.. మేల్తీ ముంగురులు (రింగుల జుట్టు) ఎంతో ముద్దుగా ఉన్నాయంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. చిన్నతనంలోనే మాల్తీ తన భారతీయ మూలాలను తెలుసుకుంటూ సంస్కృతిని నేర్చుకోవడం చూడటం ఎంతో ఆనందంగా ఉందంటూ అభిమానులు ప్రియాంక పెంపకాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ ఫోటోలపై బిపాసా బసు, మీరా చోప్రా, అంజులా ఆచార్య వంటి ప్రముఖులు సైతం లవ్ ఎమోజీలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కుటుంబ విశేషాలతో పాటు తన తదుపరి సినిమాల అప్‌డేట్స్‌ను కూడా ప్రియాంక నిరంతరం షేర్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రం. ఇటీవల `ఆన్ టు ది నెక్ట్స్ ..` అంటూ పీసీ పెట్టిన పోస్ట్ గ్లోబల్ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. హాలీవుడ్ దిగ్గజ నటుడు రస్సెల్ క్రోతో కలిసి నటించనున్న కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఈ అప్‌డేట్ చూసి చిత్రపరిశ్రమతో పాటు అభిమానులు ఎంతో ఉత్కంఠకు లోనవుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ది గ్రేట్ ప్రియాంక చోప్రా సాధిస్తున్న వరుస విజయాలకు ప్రతీకగా ఈ కొత్త ప్రాజెక్ట్ నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ అప్‌డేట్‌పై హాలీవుడ్ -బాలీవుడ్ ప్రముఖుల నుండి విశేష స్పందన లభించింది. ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఫైర్ ఎమోజీతో తన సంతోషాన్ని వ్యక్తం చేయగా... ప్రముఖ నటీమణులు హుమా ఖురేషి, చిత్రాంగద సింగ్, నితాంశి గోయల్, సోఫీ చౌదరి- దర్శకుడు తరుణ్ మన్సుఖాని వంటి వారు పీసీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖుల కామెంట్లు ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి.

అలాగే త్వరలో ప్రారంభం కానున్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ `రీసెట్` షూటింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతదేశ కీర్తిని అంతర్జాతీయ వేదికలపై ఎగరేస్తున్న నిజమైన క్వీన్ అని అభిమానులు కొనియాడుతున్నారు. వరుస అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లతో నిరంతరం బిజీగా ఉంటూ.. గ్లోబల్ ఐకాన్‌గా ప్రియాంక చోప్రా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నారు.

Tags:    

Similar News