ఇండియన్ టామ్ క్రూజ్ ఎవరంటే?
సాహాసోపేమైన పాత్రలు..నిర్ణయాలతోనే అది సాధ్యమైంది. ఇప్పుడామె హాలీవుడ్ లో కోట్లాది రూపాయలు పారితోషికం అందుకుంటుంది. ఇమేజ్ రెట్టింపు అయింది. అలాగని బాలీవుడ్ ని మర్చిపోలేదు.;
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నేడు వరల్డ్ వైడ్ ఎంతో ఫేమస్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి ఆ రేంజ్ సక్సెస్ ను అందుకున్న ఏకైక నటి. బాలీవుడ్ నుంచి చాలా మంది నటీమణులు హాలీవుడ్ లో సినిమాలు చేసారు. కానీ పీసీ రేంజ్ లో ఎవరూ సక్సెస్ కాలేదు. అందుకు ప్రియాంక చోప్రా తెగింపు కూడా ఓ కారణం. సాహాసోపేమైన పాత్రలు..నిర్ణయాలతోనే అది సాధ్యమైంది. ఇప్పుడామె హాలీవుడ్ లో కోట్లాది రూపాయలు పారితోషికం అందుకుంటుంది. ఇమేజ్ రెట్టింపు అయింది. అలాగని బాలీవుడ్ ని మర్చిపోలేదు.
సమయా భావం వల్ల హిందీ సినిమాలు చేయలేకపోతుంది. అయినా తానెంత ఎదిగిన బాలీవుడ్ పై తన ప్రేమను ఎప్పటిప్పుడు వ్యక్తం చేస్తూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ని హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ తో పోలిక చేసింది. బాలీవుడ్ లో అక్షయ్ తాను ఇష్టపడే గొప్ప నటుడిగా కీర్తించింది. అక్షయ్ చేసే సాహసోపేతమైన విన్యాసాలంటే తనకు ఎంతో ఇష్టమంది.
'హాలీవుడ్ లో టామ్ క్రూజ్ ఇలాంటి పాత్రలు చేయగలడు. తెరపై వాళ్లిద్దర్ని చూస్తుంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. టామ్-అక్షయ్ తరుచుగా తమ సినిమాల్లో రిస్క్ తో కూడిన సన్నివేశాలు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు. ఇలా అందరూ చేయలేరు. కొందరికి మాత్రమే సాధ్యం. అందులో నా దృష్టిలో వీళ్లిద్దరు ముందు వరుసలో ఉంటారు. అక్షయ్ కుమార్ ధైర్యమైన నిర్ణయాలతో సినిమాలు చేయడం ఎంతో నచ్చుతుంది.
నాకు కూడా భారీ స్థాయిలో స్టంట్ లు..సాహసాలు చేసే పాత్రల్లో నటించాలని ఉంటుంది. అందుకే హాలీవుడ్ లో ఎలాంటి స్టంట్ సినిమా అవకాశాలు వచ్చినా వదిలిపెట్టకుండా పనిచేస్తా. ఇది నాకెంతో కిక్ అందిస్తుంది. ఎన్ని జానర్ సినిమాలు చేసినా యాక్షన్ సినిమాలంటేనే ఎక్కువ ఆసక్తి' అని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎస్ ఎస్ ఎంబీ 29 లో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసింది. ఇది ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్. సాహసకుడి పాత్రలో మహేష్ కనిపిస్తాడు. మరి ఆయన సరసన పీసీ? సాహసకురాలు అవుతుందా? అన్నది చూడాలి.