అలాంటి కామెంట్స్.. ట్రోలర్స్ కి స్టఫ్ ఇచ్చినట్టే..!
ఐతే నాని చేసిన కామెంట్స్ నే యాజిటీజ్ దించేశాడు ప్రియదర్శి. ఓ పక్క సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే కంటెంట్ ఉన్న సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నాడు ప్రియదర్శి.;
సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో రిలీజ్ ముందు వరకు సినిమా గురించి ఏదేదో చెప్పేస్తారు. ముఖ్యంగా సినిమా ఇలా ఉంటుంది.. సినిమా అలా ఉంటుందని ఊదరగొట్టేస్తారు. ఇంకా కొందరు అయితే ఈ సినిమా నచ్చకపోతే నెక్స్ట్ నా సినిమా చూదొద్దని అంటారు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా. యెస్ న్యాచురల్ స్టార్ నాని కోర్ట్ సినిమా టైం లో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. సినిమా నచ్చకపోతే నెక్స్ట్ సినిమా చూడొద్దని అన్నాడు. ఐతే అలా నాని అనడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. కోర్ట్ సినిమాపై తనకున్న నమ్మకం ఒకటైతే.. నెక్స్ట్ నాని హిట్ 3 సినిమా తన ఓన్ ప్రొడక్షన్ లోనే తెరకెక్కించారు. అందుకే కోర్ట్ నచ్చకపోటే హిట్ 3 చూడకండి అన్నాడు.
నాని కామెంట్స్ యాజిటీజ్ గా..
ఐతే నాని చేసిన కామెంట్స్ నే యాజిటీజ్ దించేశాడు ప్రియదర్శి. ఓ పక్క సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే కంటెంట్ ఉన్న సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నాడు ప్రియదర్శి. అతను సినిమాలో ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే లేటెస్ట్ గా ప్రియదర్శి తను నటించిన మిత్ర మండలి రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా నచ్చకపోటే నా నెక్స్ట్ సినిమా చూడకండి అని చెప్పాడు.
ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయాలంటే కాస్త గట్స్ ఉండాలి. ఎందుకంటే సినిమా మీద ఎంతో నమ్మకం ఉంటేనే అలాంటి కామెంట్స్ చేస్తారు. ఐతే సినిమా టాక్ ఏంటి అన్నది ఆడియన్స్ చూసి రెస్పాండ్ అయ్యే వరకు చెప్పడం కష్టం. కచ్చితంగా వాళ్లకు నచ్చుతుంది అని చెప్పే సినిమాలు చాలా మిస్ ఫైర్ అయ్యాయి.
జాతిరత్నాలు నుంచి ఇలాంటి సినిమాలకు మంచి డిమాండ్..
ఇక రిలీజైన మిత్ర మండలి సినిమాకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. పోటీగా మరో 3 సినిమాలు ఉండటం వల్ల ఈ టాక్ తో సినిమా గట్టెక్కుతుందా అన్న డౌట్ వస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియదర్శి సినిమా కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.. నచ్చకపోతే నెక్స్ట్ సినిమా చూడొద్దని చెప్పాడు.
మిత్ర మండలి ఒక ఫన్ రైడ్ మూవీగా ప్రమోషన్స్ చేశారు. జాతిరత్నాలు నుంచి ఇలాంటి సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత మ్యాడ్, మ్యాడ్ మాక్స్, లిటిల్ హార్ట్స్ ఇలా ఎంటర్టైన్ చేస్తే చాలు సూపర్ హిట్ అయినట్టే అనుకున్నారు. కానీ మిత్ర మండలి విషయంలో మాత్రం ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కాలేదు. సినిమా చూసిన ఆడియన్స్ మిక్సెడ్ గా రెస్పాండ్ అవుతున్నారు.
సినిమా మీద తనకున్న కాన్ఫిడెన్స్ కొద్దీ..
మరి ఇలాంటి సినిమాకు ప్రియదర్శి అలాంటి కామెంట్స్ చేయడం వల్ల కచ్చితంగా ఎంతోకొంత ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. తనను తాను ప్రూవ్ చేసుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ప్రియదర్శి. సినిమా మీద తనకున్న కాన్ఫిడెన్స్ కొద్దీ కొన్నిసార్లు కొన్ని స్టేట్మెంట్స్ చేయొచ్చు. కానీ అది అంచనాలకు రీచ్ అవ్వకపోతే మాత్రం కచ్చితంగా ఆ కామెంట్స్ ట్రోలర్స్ కి మంచి స్టఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇలాంటి స్టేట్మెంట్స్ లాంటివి కాకుండా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేలా మంచి కామెంట్స్ చేస్తే బెటర్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు.