ఈ వయసులోనూ ఇంతందమా..!
సినిమాలు చూసేవారికి శైలజ ప్రియ పరిచయమే. ఎన్నో సినిమాల్లో అక్కగా, వదినగా, పిన్నిగా, అమ్మగా నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు ప్రియ.;
సినిమాలు చూసేవారికి శైలజ ప్రియ పరిచయమే. ఎన్నో సినిమాల్లో అక్కగా, వదినగా, పిన్నిగా, అమ్మగా నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు ప్రియ. 1997లో వెండితెరకు పరిచమైన శైలజ ప్రియ ఆ తర్వాత సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటారు.
ప్రియ అందానికి ఫిదా అవని వారుండరు. దానికి తోడు ఆమె ఎంతో మంచి నటి కూడా. అందుకే ఆమె ఎప్పుడూ చేతి నిండా అవకాశాలతో బిజీగా ఉంటారు. కేవలం ప్రియ యాక్టింగ్‌కే కాకుండా, ఆమె అందానికి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 47. ఈ వయసులో కూడా ప్రియ చాలా అందంగా, హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నారు.
తాజాగా ప్రియ వెకేషన్ కు వెళ్లి దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోల్లో ప్రియ మరింత అందంగా కనిపిస్తున్నారు. మామూలుగా ప్రియ కాస్త బొద్దుగానే ఉంటారు. ఆమె హైట్ కు తగ్గ పర్సనాలిటీతో ఉండే ప్రియ రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోల్లో చాలా స్లిమ్ గా మారినట్టు కనిపించారు. స్లిమ్ గా అవడమే కాకుండా ప్రియ ఈ ఫోటోల్లో మరింత అందంగా కూడా కనిపించారు.
ఈ ఫోటోలను చూసి వయసు కేవలం నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేశారంటూ కామెంట్స్ చేస్తూ, ఆమె షేర్ చేసిన న్యూ లుక్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న ప్రియ, బిగ్ బాస్ తెలుగు సీజన్5 లో కనిపించి అందరినీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. ఈ వయసులో ప్రియ ఇంత స్లిమ్ గా మారడాన్ని చూసి అందరూ షాకవుతున్నారు.