వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాష్ స్ట‌న్నింగ్ బికినీ షూట్

ప్రియా ప్ర‌కాష్ ఓటీటీ రంగంలోను అవ‌కాశాలు అందుకుంటోంది. మ‌రోవైపు ప్రియా త‌న అభిమానుల‌కు సోష‌ల్ మీడియాల్లో ఫోటో ట్రీట్‌ని విడిచిపెట్ట‌డం లేదు.;

Update: 2025-12-09 18:30 GMT

ఒకే ఒక్క క‌న్ను గీటుతో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అయింది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. ఒరు ఆధార్ ల‌వ్ విడుద‌లై చాలా ఏళ్లు గ‌డిచినా ఇంకా ప్రియా క‌న్ను గీటుడు యువ‌త‌ను క‌వ్విస్తూనే ఉంది. ప్రియా ప్ర‌స్తుతం హిందీ, త‌మిళం, మ‌లయాళం, తెలుగు చిత్రాల‌లో న‌టిస్తోంది. హీరో నితిన్ స‌హా ప‌లువురు టాలీవుడ్ యంగ్ హీరోలు ప్రియాకు అవ‌కాశాలు క‌ల్పించారు. శ్రీ‌దేవి బంగ్లా పేరుతో వివాదాస్ప‌ద హిందీ చిత్రంలో ప్రియా ప్ర‌కాష్ న‌టించింది. కానీ ఈ చిత్రం విడుద‌ల కాక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. గ‌త జూన్ లో ప్రియా న‌టించిన మలయాళ చిత్రం కొల్లా ఈటీవీ విన్ లో విడుద‌లై ఆక‌ట్టుకుంది.

 

ప్రియా ప్ర‌కాష్ ఓటీటీ రంగంలోను అవ‌కాశాలు అందుకుంటోంది. మ‌రోవైపు ప్రియా త‌న అభిమానుల‌కు సోష‌ల్ మీడియాల్లో ఫోటో ట్రీట్‌ని విడిచిపెట్ట‌డం లేదు. తాజాగా ప్రియా వెకేష‌న్ కి సంబంధించిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. ప్రియా ఒక అంద‌మైన రిసార్ట్ లో ఫుల్ గా చిల్ అవుతూ క‌నిపించింది. అక్క‌డ సింపుల్ బికినీ లుక్ లో క‌నిపించిన ప్రియా రిలాక్స్ చైర్ లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో రెచ్చిపోయింది. ప్రియా ఈ లుక్ లో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాప్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్‌గా మారుతున్నాయి. ఇక ప్రియాతో పాటు వెకేష‌న్ లో ఎవ‌రెవ‌రు ఉన్నారు? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

 

ఇటీవ‌ల త‌ళా అజిత్ `గుడ్ బ్యాడ్ అగ్లీ`లో ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించిన‌ ప్రియా త‌దుప‌రి `త్రి మంకీస్` అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. అబ్బాస్ - మ‌స్తాన్ ద్వ‌యం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాణీ ముఖ‌ర్జీ, అర్జున్ రాంపాల్ లాంటి సీనియ‌ర్లు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. `ల‌వ్ హ్యాక‌ర్స్` అనే జెన్ జెడ్ సినిమాలోను ప్రియా న‌టిస్తోంది.

 

రామాయ‌ణంలో జాక్ పాట్:

రణబీర్ కపూర్ `రామాయణం`లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందని సమాచారం. నితేష్ తివారీ రెండు భాగాలుగా ఈ ఎపిక్ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ సినిమాలు 2026 దీపావళి, 2027 దీపావ‌ళి సందర్భంగా విడుదల కానున్నాయి. న‌మిత్ మ‌ల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌ణబీర్ క‌పూర్ రాముడుగా న‌టిస్తుండ‌గా, సీత‌గా సాయిప‌ల్ల‌వి, ఆంజ‌నేయునిగా స‌న్నీడియోల్ న‌టిస్తున్నారు.

 

ప్రియా ప్ర‌కాష్ తిరిగి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇటీవ‌ల ప్ర‌ముఖ యువ‌ద‌ర్శ‌కుడు ప్రియాకు క‌థ చెప్పి ఒప్పించాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ప్రాజెక్ట్ ఇంకా ఫైన‌ల్ కావాల్సి ఉంది. దీనిని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News