ప్రిన్సెస్ కూల్ ఫోజ్ ఇస్తే ఇలా
ఆమె ఎంత గొప్ప నటి అన్నది `సీతారామం`తో ప్రూవ్ అయింది.;
మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ట్యాలెంట్ ప్లస్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ గాళ్ అని చెప్పాల్సిన పనిలేదు. బుల్లి తెర నుంచి పెద్ద తెరకెక్కిన మృణాల్ నట జీవితంలో ఎన్నో సవాళ్లున్నాయి. అవన్నీ అమ్మడిని జీవితంలో మరింత రాటు దేల్చాయి. తనలో డేర్ అండ్ డ్యాషింగ్ క్వాలిటీని అక్కడ నుంచి బిల్డ్ అయిందే. ఇక నటిగా ఆమె స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎంత గొప్ప నటి అన్నది `సీతారామం`తో ప్రూవ్ అయింది.
అంతటి టప్ రోల్ నే ఎంతో సునాయాసంగా చేసింది. అలాంటి నటి ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తుంది. అమ్మడితో ఎలాంటి ఎక్స్ పెరిమెంటల్స్ అయినా చేయోచ్చు. అందుకే `హాయ్ నాన్న`లో నాని కి జోడీగా ఎంపికైంది. ఎంతో మంది భామలున్నా..నాని అండ్ కో పనిగట్టుకుని మరీ మృణాల్ ని ఎంపిక చేసారు. కేవలం ట్యాలెంట్ తో మాత్రమే నాని కల్పించిన అవకాశం. నాని సరసన హీరోయిన్లు అంటే కచ్చితంగా వాళ్లు గ్రేట్ పెర్పార్మర్స్ అవ్వాల్సిందే.
అతని సినిమాల్లో హీరోయిన్ రోల్స్ అనేవి అంత నేచురల్ గా డిజైన్ చేయబడుతుంటాయి. అందుకే `హాయ్ నాన్న` ప్రీ రిలీజ్ లో అమ్మడు సినిమా హిట్ అవ్వకపోతే ఏకంగా పేరే మార్చుకుంటానని సవాల్ విసిరింది. ఆ సంగతి పక్కనబెడితే మృణాల్ గ్లామర్ ఎలివేషన్ గురించి తెలిసిందే. అమ్మడు కాంపిటీషన్ వరల్డ్ లో ఏమాత్రం తగ్గదు. సమయం..సందర్భాన్ని బట్టి తనలో సెకెండ్ యాంగిల్ ని కూడా బయటకు తెస్తుంటుంది.
కుర్రకారుని హీటెక్కించే ఫోటోలతో నెట్టింట సంచలనం రేపుతుంటుంది. తాజాగా మృణాల్ కూల్ లుక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అందులో అమ్మడు బ్లాక్ దుస్తుల్లోకి దూరిపోయింది. టాప్ గీతలతో కూడిన డిజైన్ పై మ్యాచింగ్ బాటమ్ ధిరంచింది. అన్నింటికి మించి వేసుకున్న ఉంగరాలు వేళ్లను మరింత అందంగా తీర్చిదిద్దాయి. చెక్క కుర్చీపై అమ్మడి భంగిమలు ఇంట్రెస్టింగ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో ప్రపోజ్ చేస్తున్నారు. హార్ట్ ఎమోజీలతో ఇన్ బాక్స్ నిండిపోతుంది.