• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ, చరణ్ డేట్స్...

బన్నీ, చరణ్ డేట్స్ సెట్టవ్వలేదా?.. ప్రశాంత్ వర్మ ఏమన్నారంటే

| నిజానికి గతంలో ప్రశాంత్ వర్మ తన ఇంటర్వ్యూలలో స్టార్ హీరోలతో కూడా సంప్రదింపులు జరిపాను అని అన్నాడు

By - Tupaki Desk
Update: 2024-01-29 11:35 GMT

మొదటి సినిమా తోనే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఆ తర్వాత తన పరిధిని బట్టి తనకు వచ్చిన అవకాశాలకు అనుగుణంగా మార్కెట్ పెంచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన హనుమాన్ సినిమాతో అతని టాలెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థమైంది. తప్పకుండా భవిష్యత్తులో అతను ఇండస్ట్రీని ఏలుతాడు అంటూ రాజమౌళి కూడా మంచి ప్రశంసలు కురిపించారు.

అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే ఇంకా బాగుంటుంది అని ఓ వర్గం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ దర్శకుడు చేసిన కొన్ని కామెంట్స్ ను వక్రీకరిస్తూ అతను రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు చేయాలని అనుకున్నాడు అని అయితే వాళ్ళు డేట్స్ ఇవ్వలేదు అని అన్నట్లుగా కొన్ని కథనాలు ప్రచారం చేశారు.

ఇక సోషల్ మీడియాలో ఈ వార్తలు బాగా వైరల్ అవుతూ ఉండడంతో ఓ నెటిజన్ ఇలాగే స్పందించడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ డేట్స్ కోసం రోజులు ఎదురు చూసి తప్పు చేశాను అని వస్తున్న వార్తలపై దర్శకుడు ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు. చాలా బాగా చెప్పావు.. కానీ నేనెప్పుడూ వారి పేర్లను ప్రస్తావించలేదు.. వారంటే నాకు ఎంతో ఇష్టమని అభిమానం, సరైన స్క్రిప్ట్ సిద్ధమైతే వారితో కూడా వర్క్ చేస్తాను.. అంటూ ప్రశాంత్ వర్మ తనదైన శైలిలో సోషల్ మీడియాలో అయితే క్లారిటీ ఇచ్చేశాడు.

నిజానికి గతంలో ప్రశాంత్ వర్మ తన ఇంటర్వ్యూలలో స్టార్ హీరోలతో కూడా సంప్రదింపులు జరిపాను అని అన్నాడు. అయితే మొదట తన కథ రాసుకున్నప్పుడు దానికి ఎవరైతే సెట్ అవుతారో వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తాను అని ఇక తర్వాత కుదరకపోతే మరొక లెవెల్లో మరొక హీరోను సంప్రదిస్తాను అని ప్రశాంత్ వర్మ తెలియజేశాడు. దీంతో అతను స్టార్ హీరోలను సంప్రదించినా కూడా డేట్స్ ఇవ్వడం లేదు అని ముఖ్యంగా రామ్ చరణ్ అల్లు అర్జున్ పేర్లు కూడా వైరల్ అయ్యాయి.

ఇక అందులో వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు అని ప్రశాంత్ వర్మ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ అనే ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువచ్చాడు. ఈ సినిమాలో రానా హనుమాన్ పాత్రలో నటించే అవకాశం ఉంది అని కూడా ఒక టాక్ వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై కూడా దర్శకుడు క్లారిటీ ఇవ్వనున్నాడు. ఇక సీక్వెల్ ప్రాజెక్ట్ మరో సంక్రాంతికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tags:    
  • Prashanthvarma 
  • HanuMan 
  • Ramcharan 
  • Alluarjun 
  • Filmindustry 
  • Hanumanmovie 
  • Tollywood 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS