• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రశాంత్ వర్మ లిస్టులో...

ప్రశాంత్ వర్మ లిస్టులో సూపర్ హీరోయిన్.. ఎవరామే?

| టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఫస్ట్ మూవీ అ!తో తన టాలెంట్ ఏంటో చూపించారు

By - Tupaki Desk
Update: 2024-01-24 11:29 GMT

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఫస్ట్ మూవీ అ!తో తన టాలెంట్ ఏంటో చూపించారు. అలాగే కల్కి కూడా మంచి టాక్ అందుకుంది. ఆ తర్వాత తేజ సజ్జా హీరోగా జాంబిరెడ్డి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు హనుమాన్ సినిమాతో ఇండియన్ వైడ్ ఆడియన్స్ ను మెప్పించారు. ఈ మూవీతో ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. తక్కువ ఖర్చులో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చి హనుమాన్ సినిమాతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించారు.


అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన మొదటి చిత్రం హనుమాన్. తేజ సజ్జా సూపర్ హీరోగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. జై హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా పాత్ర చిన్నగా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ప్రశాంత్ వర్మ. అయితే రాముడు, హనుమంతుడి పాత్రలు పెద్దగా ఉంటుందని... ఆ పాత్రల్లో స్టార్ హీరోలు ఉండబోతున్నట్లు కూడా వెల్లడించారు.

ప్రస్తుతం హనుమాన్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రూ.200కోట్లకుపైగా వసూళ్ల రాబట్టి మేకర్స్ కు లాభాల పంట పండిస్తోంది. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసినట్లు ఇటీవలే ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఇక ఈ మూవీ తర్వాత పలు సూపర్ హీరో, హీరోయిన్ల సినిమాలు ఉండనున్నాయట. మొత్తం 12 సూపర్ హీరో సినిమాలు తీస్తానని.. ఇప్పటికే ఆరు మూవీలకు రైటింగ్ వర్క్ జరుగుతుందని ప్రశాంత్ వర్మ చెప్పారు. ఒక సినిమా షూటింగ్ లో ఉందని... అందులో ఓ ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ మూవీ ఉంటుందని ప్రశాంత్ వర్మ తెలిపారు.

అయితే ప్రశాంత వర్మ.. ఆ సూపర్ హీరోయిన్ సినిమా ఎవరితో తీస్తున్నారు అనే విషయాన్ని ప్రశాంత్ వర్మ ఇంకా చెప్పలేదు. ఇక మరోవైపు క్యూట్ హీరోయిన్ జ్ఞానేశ్వరి కండ్రేగుల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఆమెనే సూపర్ హీరోయిన్ కథలో నటిస్తుందా అనే తరహాలో సందేహాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎవరీ జ్ఞానేశ్వరి?

పెళ్లిచూపులు షోతో ఫేమ్ తెచ్చుకుంది జ్ఞానేశ్వరి కండ్రేగుల. ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించి మెప్పించింది. పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. మంత్ ఆఫ్ మధు, నీ జతగా, మాయలో, మిస్టర్ అండ్ మిస్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. పలు వెబ్ సిరీసుల్లో కూడా యాక్ట్ చేసింది.

Tags:    
  • Prashanthvarma 
  • Tejasajja 
  • Gnaneswarikandregula 
  • Filmindustry 
  • HanuMan 
  • Superheroine 
  • Tollywood 

Similar News

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

Copyright @2026

Powered by Blink CMS