ప్రశాంత్ వర్మ రాకింగ్ స్టార్ ని లైన్ లోకి తెస్తున్నాడా?
క్రియేటివ్ మేకింగ్‌కు మారుపేరైన ప్రశాంత్ వర్మ భారీ స్థాయి యాక్షన్ ఇమేజ్ ఉన్న యష్‌తో కలిస్తే ఆ చిత్రం ఏ రేంజ్‌లో ఉంటుందనే ఊహలే అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి.
టాలీవుడ్ యువ సంచలనం ప్రశాంత్ వర్మ పాన్ ఇండియాలో 'హనుమాన్` తో ఎలాంటి సంచలనం సృష్టించాడో తెలిసిందే. అటుపై అతడికి వచ్చిన అవకాశాలు ..ఇండస్ట్రీలో అతడికి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తనదైన శైలిలో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి తనదైన బ్రాండ్ వేసాడు. తాజాగా ప్రశాంత్ పాన్ ఇండియా స్టార్ రాకింగ్ స్టార్ యష్‌ను తదుపరి ప్రాజెక్ట్ కోసం సంప్రదిస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. క్రియేటివ్ మేకింగ్‌కు మారుపేరైన ప్రశాంత్ వర్మ భారీ స్థాయి యాక్షన్ ఇమేజ్ ఉన్న యష్‌తో కలిస్తే ఆ చిత్రం ఏ రేంజ్‌లో ఉంటుందనే ఊహలే అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి.
ప్రస్తుతం రిషబ్ శెట్టితో 'జై హనుమాన్' తెరకెక్కిస్తోన్న ప్రశాంత్ కు తదుపరి యష్ లాంటి మాస్ అప్పీల్ ఉన్న నటుడు తోడైతే? అది విజువల్ వండర్‌గా మారుతుందనేది ట్రేడ్ అనలిస్టుల అభిప్రాయం. ఇద్దరి కలయిక కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ శైలిలో మైథలాజికల్ అంశాలు .. ఫాంటసీ జోడింపులు ఎప్పుడూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. దీనికి యష్ తనదైన శైలి యాటిట్యూడ్ ..పెర్ఫార్మెన్స్‌ను జోడిస్తే స్క్రీన్ పై మ్యాజిక్ ఖాయమని చెప్పొచ్చు.
ప్రస్తుతం ఇద్దరి మధ్య కథా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని.. ఒకవేళ ఈ కాంబినేషన్ కుదిరితే భారతీయ సినీ రంగంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ను విస్తరించే క్రమంలో యష్‌ను శక్తివంతమైన పాత్ర కోసం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులను మెప్పించే కొత్తదనం కోసం చూసే ఇద్దరు ప్రతిభావంతులు కలిస్తే? అది ఖచ్చితంగా కల్ట్ క్లాసిక్‌గా నిలుస్తుంది.
ప్రస్తుతానికి అధికారిక ప్రకటన వెలువడకపోయినా? ఈ ప్రచారం సినీ ప్రియుల్లో జోష్ నింపుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే? అది బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం. యష్ గంభీరమైన నటన .. ప్రశాంత్ వర్మ ఊహాశక్తి తోడైతే తెలుగు , కన్నడ పరిశ్రమల మధ్య సత్సంబంధాలు పెరగడమే కాకుండా భారతీయ ప్రేక్షకులకు మరొక అద్భుతమైన సినిమా అనుభవం దక్కుతుంది. ఈ ప్రాజెక్టుపై స్పష్టత రావాలంటే? ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.
యశ్ త్వరలోనే 'టాక్సిక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు అంతకంతకు పెంచేసాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన సినిమాపై కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు. ఓ మహిళా దర్శకురాలు శృంగార సన్నివేశాల విషయంలో అతిగా చిత్రీకరించడంపై విమర్శలు అదే స్థాయిలో వ్యక్తమవుతున్నాయి.