ప్రకటనల వరకేనా..ప్రశాంత్ వర్మను ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్.. అసలేమైందంటే?

అలాగే హనుమాన్ మూవీ తర్వాత ప్రభాస్ కూడా ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అలా ప్రభాస్ మూవీకి స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీ చేశారు.;

Update: 2025-09-23 08:21 GMT

హనుమాన్ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.. అ! సినిమాతో డైరెక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ప్రశాంత్ వర్మ.. ఆ తర్వాత జాంబిరెడ్డి,అద్భుతం వంటి సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు ఏదో సో సో గా అనిపించినప్పటికీ.. నాలుగో సినిమాగా వచ్చిన 'హనుమాన్' మూవీ మాత్రం ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.తక్కువ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీని చూసి ఎంతోమంది ప్రశంసించారు. అలా ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా ఒక మెట్టు ఎక్కారు. హనుమాన్ మూవీ హిట్ అయ్యాక ఈయనతో సినిమాలు చేయడానికి ఎంతోమంది స్టార్ హీరోలు కూడా ఆసక్తి కనబరిచారు. అలా వరుస అవకాశాలు రావడమే కాకుండా ఎన్నో సినిమాలను ప్రకటించారు కూడా..

దీనికి తోడు అయితే తాజాగా ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కళ్యాణ్ ని హీరోగా పెట్టి

పీవీసీయు బ్యానర్ నుండి అధీర అనే కొత్త సినిమాని అనౌన్స్ చేశారు ప్రశాంత్ వర్మ. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో చాలామంది ప్రశాంత్ వర్మ పై ప్రశ్నలు సంధిస్తున్నారు. సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తే ప్రశాంత్ వర్మపై ప్రశ్నలు గొప్పించడం ఏంటి అని మీరనుకోవచ్చు. అయితే ప్రశాంత్ వర్మపై విమర్శలు రావడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే ప్రశాంత్ వర్మ సినిమాలను అనౌన్స్ చేయడం తప్ప వాటిని ఆచరణలో పెట్టడం లేదు అని ఎంతోమంది ఆయనను విమర్శిస్తున్నారు కూడా.

ఎందుకంటే ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్టు వార్తలు వినిపించాయి.వార్తలు వినిపించడమే కాదు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ అని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అలాగే మోక్షజ్ఞతో చేసే మూవీ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగమన్నట్లు కూడా ప్రశాంత్ వర్మ ప్రకటించారు.

అలాగే హనుమాన్ మూవీ తర్వాత ప్రభాస్ కూడా ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అలా ప్రభాస్ మూవీకి స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీ చేశారు. అలాగే బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తో బ్రహ్మ రాక్షస్ పేరుతో ఓ సినిమా రాబోతున్నట్టు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది.. ఇలా దాదాపు నాలుగు సినిమాలకు సంబంధించి అనౌన్స్మెంట్లు తప్పితే.. ఇప్పటివరకు ఒక్క సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది లేదు.

అటు మోక్షజ్ఞ సినిమా చూసుకుంటే..మోక్షజ్ఞ బర్త్ డే రోజు ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ సినిమా ముందుకు కదిలింది లేదు. దాంతో ప్రశాంత్ వర్మ మీద అసంతృప్తి వ్యక్తం చేసిన బాలకృష్ణ.. తన కొడుకు మొదటి మూవీని క్రిష్ దర్శకత్వంలో తీసుకురావాలని చూస్తున్నారు. అలాగే ప్రభాస్ తో సినిమా ఉందని ప్రకటించారు. పైగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీగా ఉంది.. కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సినిమా ఇప్పట్లో అయ్యేలా లేదు.

అలాగే బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తో బ్రహ్మ రాక్షస్ సినిమా కూడా అటకెక్కింది. హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని అనౌన్స్ చేసినప్పటికీ ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులైనా జై హనుమాన్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. జై హనుమాన్ మూవీలో రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో కనిపిస్తున్నట్టు.. రాముడి బొమ్మ పట్టుకొని ఉన్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు తప్పితే మళ్ళీ ఆ సినిమా గురించి ఇంకొక అప్డేట్ అయితే రావడం లేదు. ఇవన్నీ చాలాదన్నట్టు తాజాగా ప్రశాంత్ వర్మ డివివి దానయ్య కుమారుడితో అధీర అనే మూవీని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య విలన్ గా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు స్క్రిప్ట్ ని అందిస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం అధీరా పోస్టర్ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ వర్మని ఏకీపారేస్తున్నారు.. అధీర సినిమానైనా సెట్స్ మీదకు తీసుకెళ్లి ఈ ఏడాది విడుదల చేస్తారా.. లేక ఈ సినిమాను కూడా మిగతా సినిమాల్లాగే పోస్టర్లు రిలీజ్ చేసి సినిమాను పక్కన పెడతారా.. ఫస్ట్ లుక్ పోస్టర్లు అనౌన్స్ చేయడం తప్ప సినిమాలు తీసేది ఏమైనా ఉందా? లేదా? అంటూ నెటిజన్లు పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు.

అనౌన్స్ చేసిన చిత్రాలే పట్టాలెక్కలేదు దీనికి తోడు.. రీసెంట్ గా మిరాయ్ మూవీ హిట్ అవ్వడంతో జాంబిరెడ్డి-2 మూవీని కూడా తీస్తామని నిర్మాత విశ్వప్రసాద్ ప్రకటించారు. ఈ జాంబిరెడ్డి మూవీకి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేశారు కాబట్టి జాంబిరెడ్డి 2 కు కూడా ప్రశాంత్ వర్మనే డైరెక్షన్ చేస్తారని తెలుస్తోంది.మరి ఇన్ని ప్రాజెక్టులు ప్రశాంత్ వర్మ కంప్లీట్ చేస్తారా.. లేక పోస్టర్ల వరకే పరిమితం అవుతారా అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News