పిక్‌టాక్ : నీ సొగసు చూడతరమా..!

'ఎమ్ పిల్లో ఎమ్ పిల్లాడో' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ప్రణిత సుభాష్. ఈ కన్నడ ముద్దుగుమ్మ తెలుగులో చాలా సినిమాలు చేసింది.;

Update: 2025-09-19 08:30 GMT

 'ఎమ్ పిల్లో ఎమ్ పిల్లాడో' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ప్రణిత సుభాష్. ఈ కన్నడ ముద్దుగుమ్మ తెలుగులో చాలా సినిమాలు చేసింది. పలువురు స్టార్‌ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. కానీ లక్‌ కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి స్టార్‌డం దక్కలేదు. పవన్‌ కళ్యాణ్‌తో అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన ప్రణీత, ఎన్టీఆర్‌ సినిమా రభసలోనూ నటించిన విషయం తెల్సిందే. కానీ లక్‌ కలిసి రాకపోవడంతో ముద్దుగుమ్మకు లక్ కలిసి రాలేదు. హీరోయిన్‌గా పెద్ద సినిమాల్లో నటించలేదు. కానీ వరుస సినిమాల్లో నటించింది. ఆకట్టుకునే అందంతో పాటు నటన ప్రతిభ ఉన్న ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా కన్నడం, తమిళ చిత్రాల్లోనూ నటించిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా ప్రణిత మళ్లీ బిజీ కావడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత చేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రణిత ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్లు

ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఇప్పటికీ ప్రణిత ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో ఎలా ఉందో అలాగే ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌తో ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గానూ గుర్తింపు దక్కించుకుంది. ప్రణిత యొక్క రూపం ఇప్పటికీ యంగ్‌ హీరోయిన్స్‌కి పోటీ అన్నట్లుగా ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్లు అవుతున్నప్పటికీ ఈమెకు ఇప్పటికి మంచి గుర్తింపు ఉంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఈమె ఓకే చెప్పాలే కానీ వరుసగా ఆఫర్లు వచ్చి పడుతాయి. కానీ ఈమె మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే నటిగానూ సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉంది. ప్రణిత యొక్క అందమైన రూపం కారణంగా ముందు ముందు మళ్లీ ఈమె బిజీ కావడం ఖాయం అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అందాల ఆరబోత ఫోటోలు

తాజాగా ఈమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసిన ఈ ఫోటోలు ఆమె గురించి మళ్లీ చర్చించుకునేలా చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఔట్‌ ఫిట్‌ కారణంగా ప్రణిత ఎప్పుడూ వైరల్‌ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు ఏమీ చేయడం లేదు. అయినా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసే ఫోటోలు, వీడియోల కారణంగా వైరల్‌ కావడంతో పాటు, వార్తల్లో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఔట్‌ ఫిట్‌ లో ప్రణిత సొగసు చూడతరమా అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. లైట్‌ కలర్‌ ఔట్‌ ఫిట్‌ లో డీసెంట్‌ హెయిర్‌ స్టైల్‌ తో చూపు తిప్పనివ్వని ప్రణిత అందంను చూసి ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు వావ్‌ నిజంగా బాపు బొమ్మ అన్నట్లుగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫోటోల కారణంగా ప్రణిత ఇండస్ట్రీలో మళ్లీ బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు..

2010లో దర్శన్‌కి జోడీగా పోర్కి సినిమాలో నటించడం ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రణిత అసలు పేరు ప్రణిత సుభాష్‌. కర్ణాటకలో జన్మించిన ఈమె మొదటి సినిమా కన్నడంలో చేసి ఆ తర్వాత టాలీవుడ్‌, కోలీవుడ్‌లో చేసిన విషయం తెల్సిందే. తెలుగులో ఈమె చేసిన బావ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. తమిళ్‌లో ఈమె కార్తీతో చేసిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది సైతం ఈమె నటించిన రెండు సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అని, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఓకే చెప్పబోతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రణిత మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగాల్సిన అందాల మెటీరియల్‌ అంటూ ఆమె అభిమానులు సోషల్‌ మీడియాలో ప్రముఖంగా మాట్లాడుకుంటూ ఉంటారు.

Tags:    

Similar News