జిల్లనిపించిన ప్రణీత బ్లాక్ బికినీ
బికినీ ధరించినా కానీ ఎక్కడా హద్దు మీరకుండా అందంగా ఫోజులిచ్చింది ప్రణీత.;
నలుపు ఎదుటివారి అందాన్ని ఇనుమడింపజేస్తుంది. నల్ల బికినీ లేదా నల్లటి స్విమ్ సూట్ ధరిస్తే ఆ ప్రభావం కూడా మనసులపై అలానే ముద్రించుకుపోతుంది. ఇక్కడ పెళ్లయి కిడ్స్ ఉన్న ప్రణీత సుభాష్ ఇప్పుడు బ్లాక్ బికినీతో కుర్రకారు హృదయాలపై చెరగని ముద్ర వేసింది.
బికినీ ధరించినా కానీ ఎక్కడా హద్దు మీరకుండా అందంగా ఫోజులిచ్చింది ప్రణీత. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంత పర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో కనిపిస్తున్న ప్రణీత ఈ రూపం కోసం నిరంతరం జిమ్ లో శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాల్లో నిరంతరం ఫోటోట్రీట్ తో అందరికీ టచ్ లో ఉంది.
జూలై 5 అంతర్జాతీయ బికినీ దినోత్సవం సందర్భంగా ప్రణీత స్పెషల్ ట్రీట్ ఇది. ఈ లుక్ ని ఇప్పుడు అత్తారింటికి దారేది సహనటుడు చూసి ఉంటే, మళ్లీ తన సరసన కథానాయికగా అవకాశం కల్పిస్తాడేమో!
అత్తారింటి పిల్ల ఈత కొలను వద్ద బికినీలో మరిగిస్తోంది. కన్నడ చిత్రం `రమణ అవతారం`లో చివరిగా కనిపించిన ఈ భామ వెకేషన్ ని ఎంజాయ్ చేయడంలో తలమునకలుగా ఉంది. సినిమాల్లో ఛాన్సులు వస్తున్నా, తాను మాత్రం పిల్లల బాధ్యతల్ని తీసుకోవడంతో పెద్దగా ఆసక్తి చూపడం లేదని కూడా తెలుస్తోంది.