పవన్ అహంకారం వల్ల వీరమల్లు ఐదేళ్లు పట్టింది.. సీనియర్ యాక్టర్

టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు నటుడు ప్రకాష్ రాజ్.;

Update: 2025-07-30 09:59 GMT

టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు నటుడు ప్రకాష్ రాజ్. ఇప్పటికే పలుమార్లు పవన్ కామెంట్స్ పై రెస్పాండ్ అయిన ఆయన.. ఇప్పుడు రీసెంట్ గా హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

వీరమల్లు సక్సెస్ మీట్ లో సున్నితంగా ఉండకండయ్యా.. సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గట్టి సమాధానమివ్వాలని అభిమానులకు పవన్ సూచించారు. దీంతో ఇప్పటికే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు మనసాక్షి లేదని విమర్శించిన ప్రకాష్ రాజ్.. పలు ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు.

"మనసాక్షి లేని ఇలాంటి దొంగల గురించి ఏం మాట్లాడతాను. ఇది చాలా అన్యాయం. ప్రేక్షకులకు సినీ ఇండస్ట్రీకి ఏంటి సంబంధం.. కలవకపోయినా.. ఓ బంధం ఏర్పడుతుంది. హరిహర వీరమల్లు సినిమా గానీ, కన్నప్ప గానీ, గేమ్ ఛేంజర్ గానీ, థగ్ లైఫ్ గానీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఎలివేషన్స్ ఏంటి.. చెత్త సినిమాలు తీస్తున్నారని తెలియదా.. ఎవరికి అమ్ముతున్నారు.. మీరు చేస్తుంది నమ్మక ద్రోహం కాదా.. రాజమౌళి బాహుబలి సినిమా ఎలా ఆడింది.. ట్రెండ్ సెట్ చేసింది.. అదే మేము చేస్తున్నారని అనుకుంటున్నారా.. ఎలాంటి దోపిడీ చేస్తున్నారు.. ఎవరికీ చేస్తున్నారు" అని ప్రశ్నించారు.

"వీరమల్లు ఎందుకు ఐదేళ్లు లేట్ అయింది.. కథ ఉందా.. నిజాయితీ ఉందా.. చేతకాని తనంతో నిర్మాతకు ద్రోహం చేశారు.. వడ్డీలు పెరిగాయి.. కథలు మార్చారు.. రాజకీయ సిద్ధాంతాలు రుద్ది దానితో సినిమా తీయాలని చూశారు. ఐదేళ్లు కష్టపడ్డామని చెప్పారు. పది రోజుల ప్రమోషన్స్ కు వచ్చినట్లు షూటింగ్ కు వస్తే సినిమా షూటింగ్ పూర్తయ్యేది" అని అభిప్రాయపడ్డారు.

"మాకే మోసం చేశారని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. స్పీచ్ లో మాటలేంటి.. గతంలో ఓ వేదికపై మహేశ్ బాబు, ఎన్టీఆర్.. మేమంతా బాగుంటామని చెప్పారు. ఎవరూ కొట్టుకోవద్దని తెలిపారు. కానీ తిరిగి కొట్టమన్నారు పవన్. సైనికులు అంటున్నారు. ఆయన ఫ్యాన్స్ కు బాడీ పార్ట్స్ తప్ప ఇంకేం తెలియదు. ఇది మనస్సాక్షి కాదు. ఒక నాన్సెన్స్. జనాలు మూర్ఖులు కాదు. మోదీ బయోపిక్ వస్తే 100 మంది చూడలేదు" అంటూ ఎద్దేవా చేశారు.

"ఫ్యాన్సే సినిమా బాగోలేదని చెబుతున్నారు. ట్రోల్ చేస్తే గట్టిగా ట్రోల్ చేయమని అంటున్నారు. వాళ్లతో ఏం మాట్లాడగలం. ఇది కోపం కాదు. ఆవేదనగా చెబుతున్నా. సోమరితనం, అహంకారం వల్ల సినిమా ఐదేళ్లు ఆలస్యం అయింది. నిజాయతీ ఉండాలి. ఒక డైరెక్టర్ అనుకున్న పరిస్థితులు మీరు కల్పించారా.. సిగ్గుగా లేదా.. రూల్స్ లేవు కాబట్టి తప్పించుకుంటున్నారు. పాలిటిక్స్ వేరు.. సినిమాలు వేరు.. ఏదేమైనా నిన్ను ప్రేమించిన వాళ్లని దోపిడీ చేశావ్. ఇది కరెక్ట్ కాదు" అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.



Full View


Tags:    

Similar News