క్లిక్ క్లిక్ : బాలయ్య హీరోయిన్ ఫ్యామిలీని చూడండి
సరిగ్గా పదేళ్ల క్రితం 'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్.;
సరిగ్గా పదేళ్ల క్రితం 'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. అంతకు ముందే తెలుగులో ఒక సినిమా, తమిళ్‌లో ఒకటి, హిందీలో ఒకటి సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు కంచె సినిమాలో నటించినందుకు గాను వచ్చింది. కంచె సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్ స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ కంచె తో వచ్చిన సక్సెస్‌ను, గుర్తింపును ఆమె సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయింది. అంతే కాకుండా ఆ తర్వాత చేసిన సినిమాలు చిన్నా చితకా సినిమాలు కావడంతో పాటు, అవి పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోక పోవడంతో ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత పెద్దగా స్టార్‌డం పెరగలేదు అనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉంటారు.
బాలకృష్ణతో రెండు సినిమాల్లో...
ప్రగ్యా జైస్వాల్ గత పదేళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ ఆమె చేస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోవడం లేదు, అంతే కాకుండా ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టే విధంగా మంచి ఆఫర్లు సైతం ఆమె దక్కించుకోవడం లేదు. అందుకే కంచె స్థాయిలో ఇప్పటి వరకు ఆమెకు మరే సినిమా కూడా స్టార్‌డం తెచ్చి పెట్టలేదు. వచ్చిన చిన్నా చితకా ఆఫర్లను ఆమె అంగీకరించడం తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, ప్రగ్యా కు అందం ఉన్నా లక్ లేకపోవడం వల్లే ఆఫర్లు ఎక్కువ రావడం లేదు అని అంటున్నారు. బాలకృష్ణతో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ఈమె మరిన్ని సినిమాలు స్టార్ హీరోలతో చేస్తే అప్పుడు కాస్త బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
అందాల ఆరబోత ఫోటోలతో ప్రగ్యా జైస్వాల్
సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచే ప్రగ్యా జైస్వాల్ ఈసారి తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. అంతకు మించి తన తండ్రి పుట్టిన రోజును జరపడం వల్ల వార్తల్లో నిలిచింది. ఆకట్టుకునే అందంతో పాటు, అభినయం ఈమె సొంతం అని ఎప్పటికప్పుడు నెటిజన్స్ అంటూ ఉంటారు. కానీ ఈమెకు మాత్రం అంత స్థాయిలో గుర్తింపు మాత్రం దక్కలేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈమె అందాల ఆరబోత ఫోటోలు ఎక్కువ అవుతున్నాయి. కనుక ముందు ముందు ఈమెకు మళ్లీ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రావచ్చు అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రగ్యా జైస్వాల్ యంగ్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు అందుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఫ్యామిలీ మెంబర్స్‌తో ప్రగ్యా సెలబ్రేషన్
తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చిన్న ఫ్యామిలీతో ప్రగ్యా తన సంతోషాన్ని ఇలా పంచుకుంది. సాధారణంగానే అమ్మాయిలకు తండ్రులు చాలా ఎమోషన్ అంటారు. ప్రగ్యా షేర్ చేసిన ఈ ఫోటోలను చూస్తూ ఉంటే తండ్రితో ఆమెకు ఉన్న అనుబంధం ఏంటో అర్థం అవుతుంది. అంతే కాకుండా ఆమె తన కుటుంబ సభ్యులను ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా చూపించదు. ఈసారి చూపించడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలోనే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ప్రస్తుతం ఈ ఫోటోలు, ప్రగ్యా జైస్వాల్ గురించి చర్చ జరుగుతోంది. ప్రగ్యా జైస్వాల్ మరో పదేళ్లు ఇండస్ట్రీలో కొనసాగాలని, రాబోయే పదేళ్లు ఈ అమ్మడు బిజీగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. మరి అది సాధ్యమేనా చూడాలి.