పెదకాపు పాప.. డ్యాన్స్ తోనే మత్తెక్కించేసింది

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కి గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం పెదకాపు.

Update: 2024-05-16 04:34 GMT

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కి గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం పెదకాపు. ఈ మూవీ థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. గోదావరి జిల్లాలలో ఉండే కుల గొడవలని పెదకాపు సినిమాలో శ్రీకాంత్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే సినిమాలో ఎలిమెంట్స్ కన్ఫ్యూజ్ గా ఉండటంతో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు.


ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ ప్రగతి శ్రీవాస్తవ. అందులో అమ్మడు అచ్చమైన గ్రామీణ తెలుగమ్మాయిగా మంచి గుర్తింపు అందుకుంది. మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తెలుగులో మనుచరిత్ర మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెదకాపు మూవీ ప్రగతికి సక్సెస్ ఇస్తుందని ఆశించిన సాధ్యం కాలేదు.

ప్రస్తుతం హిందీలో నాకహర్ వాలి అనే సినిమాలో ప్రగతి నటిస్తోంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే తెలుగులో ఆనంద్ దేవరకొండకి జోడిగా గంగం గణేశా సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. చాలా మంది నార్త్ ఇండియన్ ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా కెరియర్ ఎంచుకుంటున్నారు. అయితే కొంతమంది ఒకటి రెండు సినిమాలకి పరిమితం అయిపోతున్నారు.

మరికొంతమంది ఒక్కో అవకాశం అందుకుంటూ నటిగా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రెండో జాబితాలో ప్రగతి శ్రీవాస్తవ ఉంది. అందాల భామలు పాపులారిటీ పెంచుకొని దర్శక, నిర్మాతల దృష్టిలో పడేందుకు ఇన్ స్టాగ్రామ్ ని వేదికగా చేసుకుంటారు. ప్రగతి శ్రీవాస్తవ కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ షార్ట్ వీడియోని ప్రగతి షేర్ చేసింది.

ఈ వీడియోలో ఆమె వైట్ కలర్ అవుట్ ఫిట్ తో హాట్ హాట్ గా పంజాబీ సాంగ్ కి స్టెప్పులేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మడు అందాల ప్రదర్శనకి కూడా సిద్ధంగా ఉందనే హింట్ ఈ షార్ట్ వీడియో ద్వారా ఇస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రగతికి తెలుగులో నేచురల్ క్యారెక్టర్స్ లభించాయి. గ్లామర్ షోకి అంతగా ప్రాధాన్యత లేదు. భవిష్యత్తులో ఏమైనా గ్లామర్ రోల్స్ లో నటించే ఛాన్స్ లు అందుకుంటుందేమో చూడాలి.

Tags:    

Similar News