యంగ్ హీరో కెరీర్ తొలి హ్యాట్రిక్

ఇండస్ట్రీలో స‌క్సెస్ అవ్వాలంటే ప్ర‌తిభ‌తో పాటు, ఆవ‌గింజంత అదృష్టం కూడా ఉండాలి. సోష‌ల్ మీడియా యుగంలో చాలా మంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వ‌చ్చి స‌క్సెస్ అవుతున్నారు.;

Update: 2025-11-07 14:30 GMT

ఇండస్ట్రీలో స‌క్సెస్ అవ్వాలంటే ప్ర‌తిభ‌తో పాటు, ఆవ‌గింజంత అదృష్టం కూడా ఉండాలి. సోష‌ల్ మీడియా యుగంలో చాలా మంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వ‌చ్చి స‌క్సెస్ అవుతున్నారు. త‌మ ట్యాలెంట్ తో సోష‌ల్ మీడియాలో ప్రూవ్ చేసుకుని అవ‌కాశాలు ఒడిసి ప‌ట్టుకుంటున్నారు. త‌మిళ న‌టుడు ప్ర‌దీప్ రంగ‌నాధ‌న్ అలా స‌క్సెస్ అయిన న‌టుడే. త‌న‌లో రైట‌ర్ కం న‌టుడు ఉండ‌టంతో అత‌డి స‌క్సెస్ మ‌రింత ఈజీ అయింది. త‌న క‌థ‌ని తానే రాసుకుని తానే న‌టించ‌డంతో? ఎవ‌రో అవ‌కాశం ఇవ్వ‌కుండా తానే ఓ అవ‌కాశాన్ని సృష్టించుకుని స్టార్ గా మారాడు.

విమ‌ర్శించిన నోళ్లే ప్ర‌శంస‌ల‌తో:

తొలి సినిమా `ల‌వ్ టుడే` కోలీవుడ్, టాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందు అత‌డు హీరో ఏంటి? అని ఎన్నో నోళ్లు విమ‌ర్శించాయి. ఆ సినిమా స‌క్స‌స్ అవ్వ‌డంతో అవే నోళ్లు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాయి. అటుపై రెండ‌వ సినిమా `డ్రాగ‌న్` తోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. తొలి సినిమా క్రేజ్ తో రెండ‌వ సినిమా కోసం యువ‌త ఎగ‌బ‌డి మ‌రీ అత‌డి సినిమాలు చూసారు. ఇలాంటి న‌టులు తెలుగులో స‌క్స‌స్ అవ్వ‌డం క‌ష్టం. హీరో క‌టౌట్ అంటే తెలుగు అభిమానులు ఎన్నో విష‌యాలు ప్ర‌మాణికంగా తీసుకుంటారు.

మూడు సినిమాలతో 300 కోట్లు:

కానీ ప్ర‌దీప్ రంగ‌నాధన్ విష‌యంలో మాత్రం ఎలాంటి ప్ర‌మాణికం లేకుండా అత‌డిని స్టార్ గా అంగీక‌రించారు. అత‌డు యూత్ పుల్ కాన్సెప్ట్ లు ఎంచుకోవ‌డంతోనే ఇది సాధ్య‌మైంది. తాజాగా ఇటీవ‌లే రిలీజ్ అయిన 'డ్యూడ్' తోనూ మంచి విజ‌యం అందుకున్నాడు. 35 కోట్ల బ‌డ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా కూడా 100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. రెండ‌వ సినిమా `డ్రాగ‌న్` 150 కోట్లు...డెబ్యూ చిత్రం కూడా 100 కోట్లు సాధించ‌డంతో? మూడు సిని మాల‌తో 300 కోట్ల క్ల‌బ్ లో చేరిన స్టార్ గా చేరిపోయాడు. కెరీర్ ఆరంభంలోనూ వ‌రుస‌గా మూడు విజ‌యాల‌తో హ్యాట్రిక్ న‌మోదు చేసిన స్టార్ గాను ప్ర‌త్యేమైన గుర్తింపు ద‌క్కింది.

డ్యూడ్ కంటే ముందే రావాలి:

ప్ర‌దీప్ రంగ‌నాదన్ నుంచి రిలీజ్ అయ్యే త‌దుప‌రి సినిమాపైనా అంచాన‌లు భారీగానే ఉన్నాయి. విగ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న 'ల‌వ్ ఇన్సురెన్స్' డిసెంబ‌ర్ లో రిలీజ్ అవుతుంది. ఇదీ రొమాంటిక్ కామెడీ చిత్ర‌మే. ఇందులో న‌య‌న‌తార గెస్ట్ రోల్ పోషించ‌డం విశేషం. వాస్త‌వానికి ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాలి.`డ్యూడ్` కంటే ముందే మొద‌లైన ప్రాజెక్ట్ ఇది. కానీ అవార్య కార‌ణ‌ల‌తో డిలే అవుతుంది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.

Tags:    

Similar News