రజనీ-కమల్ తో అతడికి ఛాన్స్ నిజమేనా?
ఈ నేపథ్యంలో యువ నటుడు కం డైరెక్టర్ ప్రదీప్ రంగ నాధ్ పేరు తెరపైకి వచ్చింది. లెజెండ్స్ ని డైరెక్ట్ చేసేది ఇతడే అంటూ ప్రచారం ఠారెత్తిపోయింది. ఇది చూసి అంతా షాక్ అయ్యారు.;
కోలీవుడ్ లెజెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్-విశ్వనటుడు కమల్ హాసన్ మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఛాన్స్ ఏదర్శకుడు అందుకుంటాడు? అన్న నేపథ్యంలో అంతా లోకేష్ కనగరాజ్ వైపే చూసారు. కానీ లోకేష్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో యువ నటుడు కం డైరెక్టర్ ప్రదీప్ రంగ నాధ్ పేరు తెరపైకి వచ్చింది. లెజెండ్స్ ని డైరెక్ట్ చేసేది ఇతడే అంటూ ప్రచారం ఠారెత్తిపోయింది. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. చిన్న వయసులోనే పెద్దగా అనుభవం లేకపోయినా రజనీ-కమల్ ని డైరెక్ట్ చేస్తున్నాడా? అని అంతా నోరెళ్ల బెట్టారు.
ఆ రెండు సినిమాల తర్వాత:
కానీ ఇప్పుడా ఛాన్స్ నీకే వచ్చిందా? అని ప్రదీన్ రంగనాధ్ ని అడిగితే నోరెళ్ల బెట్టడం ఇప్పుడు అతడి వంతు అయింది. ప్రస్తుతం తాను నటుడిగా బిజీగా ఉన్నానని.. నటన మీద మాత్రమే శ్రద్ద పెట్టి పనిచేస్తున్నట్లు తెలిపాడు. ఒకవేళ ఆ ఛాన్స్ మీకే వస్తే ఏం చేస్తారు? అంటే మాత్రం ప్రదీప్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించాడు. ఎస్ అని చెప్పలేదు నో అని చెప్పలేదు. మౌనం అర్దాంగీకారం అంటారు. అదే నిజమైతే? ఇదో చరిత్రే అవుతుంది. ప్రస్తుతం ప్రదీప్ రంగనాధ్ `డ్యూడ్`, `లవ్ ఇన్సురెన్స్ కంపెనీ` చిత్రాల్లో నటిస్తున్నాడు.
తొలిసారి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్:
త్వరలో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే `లవ్ టుడే` తర్వాత ప్రదీప్ మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కలేదు. ఈ నేపథ్యంలో తాజాగా చేస్తోన్న రెండు సినిమాల రిలీజ్ అనంతరం డైరెక్టర్ గా మరో సినిమాకు సన్నా హాలు చేస్తున్నాడు. ఓ సైన్స్-ఫిక్షన్ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని స్వీయా దర్శక త్వంలో తెరకెక్కిస్తాడు. ఇదొక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకూ ఈ జానర్ ని ఏ డైరెక్టర్ టచ్ చేయలేదని తానే ఆ ఛాన్స్ తీసుకుంటున్నట్లు తెలిపాడు.
ప్రదీప్ హీరోయిన్లు అంటే ఓ వైబ్:
ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్లు ఎవరు? అవుతారు అన్నది ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారింది. ప్రదీప్ సరస న హీరోయిన్లు అంటే మార్కెట్లో ఓ వైబ్ ఉంటుంది. అతడి ఇమేజ్ కు తగ్గ పర్పెక్ట్ భామల్ని ఎంచుకుంటాడు. ఇవానా, కదయాదు లోహార్, అనుపమ పరమేశ్వరన్ లాంటి భామలు అలా వైరల్ అయిన వారే. ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో మమితా బైజు, కృతిశెట్టి భాగమమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ హీరోయిన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.