దీపావళి విన్నర్ 'డ్యూడ్'.. 100 కోట్లతో ప్రదీప్ మరో హ్యాట్రిక్

'లవ్ టుడే', 'డ్రాగన్' వంటి వరుస హిట్ల తర్వాత, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బడా బ్యానర్‌లో ప్రదీప్ నటించిన ఈ సినిమాపై విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నాయి.;

Update: 2025-10-21 11:38 GMT

ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడం అంత ఈజి కాదు. ఇక హిట్టు కొట్టిన తరువాత మళ్ళీ అదే రేంజ్ లో మరో హిట్ అందుకోవడం మరింత కష్టం. అయితే ఇటీవల కాలంలో ఎవరికి సాధ్యం కానీ తరహాలో ప్రదీప్ రంగనాథన్ వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు మూడోసారి కూడా బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టేందుకు డ్యూడ్ తో స్పీడ్ పెంచుతున్నాడు.



 


'లవ్ టుడే', 'డ్రాగన్' వంటి వరుస హిట్ల తర్వాత, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బడా బ్యానర్‌లో ప్రదీప్ నటించిన ఈ సినిమాపై విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే, ఈ దీపావళి వీకెండ్‌ను 'డ్యూడ్' పూర్తిగా డామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక లేటెస్ట్ గా చిత్రయూనిట్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం, 'డ్యూడ్' బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంది.

ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.83 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నంబర్‌తో, ఈ దీపావళికి అసలైన విన్నర్‌గా డ్యూడ్ అనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ భారీ వసూళ్లతో 'డ్యూడ్' ఇప్పుడు శరవేగంగా 100 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది.

ఇక ఆ రికార్డ్ తో ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో మరో 100 కోట్ల హిట్టు పడినట్లు అవుతుంది. ఇప్పటికే మొదటి సినిమా లవ్ స్టొరీతో పాటు ఆ తరువాత వచ్చిన డ్రాగన్ తెలుగు తమిళ్ లో కలిపి బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టేసింది. ఇక డ్యూడ్ హ్యాట్రిక్ గా మరో 100 కోట్ల హిట్టుని ఇవ్వబోతోంది. యంగ్ హీరోలలో ఈ రేంజ్ కన్సిస్టెన్సీ చూపించడం మామూలు విషయం కాదు.

ఈ ఫీట్‌తో ప్రదీప్ తన స్టార్‌డమ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్తున్నాడు. మొత్తం మీద, 'డ్యూడ్' సినిమాను నిర్మించిన వారికి, కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నట్లు తెలుస్తోంది. పర్ఫెక్ట్ టైమింగ్‌లో విడుదలై, పండగ సీజన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న 'డ్యూడ్', మరికొన్ని రోజులు మరిన్ని సాలీడ్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News