డ్రాగన్ మళ్లీ బరిలోకి దిగుతున్నాడా?
'లవ్ టుడే' తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రదీప్ రంగనాధన్ టాలీవుడ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.;
'లవ్ టుడే' తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రదీప్ రంగనాధన్ టాలీవుడ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అటుపై 'డ్రాగన్' తో ఆ సక్సెస్ ని కంటున్యూ చేసాడు. ఇప్పుడు ఏకంగా నయా బ్యానర్లకే ప్రమోట్ అయ్యాడు. ఇప్పుడీ హీరోతో లేడీ సూపర్ స్టార్ నయనతార 'లవ్ ఇన్సెరెన్స్ కంపెనీ' పేరుతో ఓ సినిమా నిర్మిస్తుంది. అలాగే టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 'డ్యూడ్' అనే చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలున్నాయి. లవ్ టుడేని స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించి సక్సెస్ అందుకోవడంతో? అటుపై దర్శకుడిగా తప్పుకుని హీరోగా కొనసాగుతున్నాడు. దీంతో ప్రదీప్ ప్రయాణం కొన్నాళ్ల పాటు ఇలాగే ఉంటుందనుకున్నారంతా. కానీ 'డ్రాగన్' మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కుతున్నాడు. ఆయనే హీరోగా నటిస్తూ మరో చిత్రాన్ని డైరెక్టర్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమైంది. అయితే ఇది గత చిత్రాలకు భిన్నమైన స్క్రిప్ట్. ఇప్పుడు ఏకంగా సైన్స్ ఫిక్షన్ పైనే పడ్డాడు. అలాగని భారీ బడ్జెట్ చిత్రం కాదు. కథ పరంగానే సైన్స్ పిక్షన్ కి తన మార్క్ సెన్సిబిలిటీస్ జోడించి రాసిన స్టోరీగా తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న కమిట్ మెంట్లు పూర్తి చేసిన తర్వాత ఆ సినిమా పనుల్లో బిజీ కానున్నాడని సమాచారం. ఇప్పటికే తన రైటింగ్ టీమ్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిందని సమాచారం.
ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రదీప్ సినిమాల్లో హీరోయిన్లు అంటే ఓ క్రేజ్ ఉంటుంది. యూత్ టార్గెట్ గా అతడి హీరోయిన్ల సెలక్షన్ ఉంటుంది. దీంతో సైన్స్ ఫిక్షన్ చిత్రంలో హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటాడు? అన్న దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.