యాంకర్ కమ్ హీరో నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

ఇక హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేసిన ప్రదీప్ ఆ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.;

Update: 2025-06-13 05:00 GMT
యాంకర్ కమ్ హీరో నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ మేల్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు తన సినిమా కల నెరవేర్చుకునేందుకు అడపాదడపా ప్రయత్నాలు చేస్తాడు. ఓ పక్క షోలు చేస్తూ ఒక ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి అలా వెళ్లి ఒక సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించి మళ్లీ వచ్చి స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తాడు. ప్రదీప్ యాంకర్ గా బిజీ అవ్వకముందు సినిమాల్లో సైడ్ రోల్స్ చేశాడు. ఐతే బుల్లితెర మీద తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ వచ్చాక ఆ రోల్స్ వచ్చినా కాదనేశాడు.

ఇక హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేసిన ప్రదీప్ ఆ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. మున్నా డైరెక్షన్లో తెరకెక్కిన ఆ సినిమాకు అనూప్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఫలితంగా సినిమా సక్సెస్ అయ్యి హీరోగా ప్రదీప్ కి మంచి మార్కులు పడేసింది. ఆ సినిమా సక్సెస్ ఐనా కూడా ప్రదీప్ మళ్లీ కొన్నాళ్లు స్మాల్ స్క్రీన్ కే పరిమితం అయ్యాడు. హీరోగా మరో ఛాన్స్ రాలేదా లేక తనే కావాలని గ్యాప్ తీసుకున్నాడా అన్నది తెలియదు కానీ ప్రదీప్ వెయిట్ చేసి చేసి ఫైనల్ గా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చేశాడు.

ఆ సినిమా ఈమధ్యనే రిలీజై పర్వాలేదనిపించింది. సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా ప్రదీప్ ప్రయత్నం అతన్ని ఇష్టపడే వారికి కొంత మెప్పించిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో మరో బుల్లితెర తార దీపిక పిల్లి హీరోయిన్ గా నటించడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఐతే ప్రదీప్ రెండో సినిమా అటెంప్ట్ కూడా అయ్యింది నెక్స్ట్ ఏం చేస్తాడు. థర్డ్ సినిమాను వెంటనే చేస్తాడా లేదా మళ్లీ బౌన్స్ బ్యాక్ టు స్మాల్ స్క్రీన్ అంటాడా అన్నది తెలియాల్సి ఉంది.

ఇలా ఒక సినిమా చేసి గ్యాప్ ఇచ్చి మరో సినిమా చేయడం వల్ల ప్రదీప్ కి ఎలాంటి ఉపయోగం ఉండదు. తను హీరోగా సెటిల్ అవ్వాలని ఫిక్స్ ఐతే మాత్రం ఎలాగు బుల్లితెర మీద తనకు ఒక మంచి క్రేజ్ ఉంది కాబట్టి హీరోగానే ప్రయత్నాలు చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. ఐతే ప్రదీప్ మాత్రం ఇంకా ఏది కచ్చితంగా నిర్ణయం తీసుకున్నట్టు లేదు. అందుకే అటు సినిమాలు ఇటు బుల్లితెర మీద కనిపించట్లేదు. ఒకప్పుడు టీవీ ఆన్ చేస్తే ప్రతి ఛానెల్ లో ఏదో ఒక ప్రోగ్రాం తో కనిపించే ప్రదీప్ ని స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ మిస్ అవుతున్నారని చెప్పొచ్చు.

Tags:    

Similar News