ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ తో ప్రేమ, పెళ్లి..
ప్రభుదేవా మాట్లాడుతూ.. "నేను హిందీలో ఒక సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ సమయంలో నా చేతికి గాయం అయింది. దీంతో ఫిజియోథెరపీ దగ్గరకు వెళ్లాను.;
సాధారణంగా అప్పుడప్పుడు జరిగే పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అనుకోకుండా పరిచయాలు ఏర్పడడం.. ఆ పరిచయాలు ప్రేమగా మారి పెళ్లిళ్లు కూడా చేసుకునే స్టేజ్ కి చేరుకుంటూ ఉంటాయి. సరిగ్గా తన జీవితంలో కూడా అలాగే జరిగింది అని చెబుతున్నారు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా. డాన్స్ కొరియోగ్రాఫర్ గా.. నటుడిగా.. డైరెక్టర్ గా.. హీరోగా.. ఆఖరికి నిర్మాతగా కూడా సత్తా చాటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలో కూడా సక్సెస్ చూశారు. ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ అన్ని పరిశ్రమలలో బిజీగా ఉన్న ఈయన తాజాగా జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి విచ్చేశారు.
ఇందులో తన లవ్ స్టోరీ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. విషయంలోకి వెళ్తే 1995లో రమాలత్ అనే మహిళను ప్రభుదేవా పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ప్రభుదేవా నయనతారతో రిలేషన్ లో ఉన్నారనే ఆరోపణలు చేస్తూ రమాలత్ మీడియా ముందుకు వచ్చింది. ఆ తర్వాత నయనతార, ప్రభుదేవా విడిపోయారు. అటు రమాలత్ కూడా తన భర్త ప్రభుదేవా నుండి విడిపోయింది.అంతేకాదు భరణం కింద భారీగానే తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. అలా అన్నీ సద్దుమణిగాక అప్పటివరకు ఒంటరిగా ఉన్న ప్రభుదేవా 2020లో హిమనీ సింగ్ అనే డాక్టర్ ను వివాహం చేసుకున్నారు. అయితే ఈమెతో పరిచయం ఎలా ఏర్పడింది? పెళ్లి వరకు ఎలా దారితీసింది? అనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రభుదేవా మాట్లాడుతూ.. "నేను హిందీలో ఒక సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ సమయంలో నా చేతికి గాయం అయింది. దీంతో ఫిజియోథెరపీ దగ్గరకు వెళ్లాను. అప్పుడు హిమనీ సింగ్ అనే డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేసింది. ఆమెతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమలో పడేలా చేసింది. అలా 2020లో మేము పెళ్లి చేసుకున్నాం. మాకు సియా అనే అమ్మాయి కూడా జన్మించింది. హిమనీ సింగ్ నా జీవితంలోకి వచ్చినా.. ఆ నొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ నేను ఈ విషయం ఆమెతో చెబుతూ ఉంటాను" అంటూ తెలిపారు ప్రభుదేవా.
ప్రభుదేవా రెండవ భార్య హిమనీ సింగ్ విషయానికి వస్తే.. ఈమె ఎక్కడ ఎక్కువగా బయట కనిపించిన దాఖలాలు లేవు. ఒక షోలో మాత్రమే తన భర్త గురించి ఆమె మాట్లాడింది. అలాగే మరొకసారి తిరుమలలో కనిపించింది.. ఇక సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటూ ముంబైలో డాక్టర్ గా సెటిల్ అయిపోయింది హిమనీ. అటు ప్రభుదేవా కూడా ముంబైలోనే నివాసం ఉంటూ తన పని మీద అన్ని పరిశ్రమలకు తిరుగుతూ తన కెరీర్ లో ముందడుగు వేస్తున్నారు. ఏది ఏమైనా ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ తోనే ప్రేమలో పడి ఆమెనే పెళ్లి చేసుకుని ఇప్పుడు తండ్రి కూడా అయ్యారు ప్రభుదేవా. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.