'ది రాజాసాబ్' టీజర్ ఎలా ఉండబోతోందంటే..
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్ జూన్ 16న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.;
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్ జూన్ 16న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ డబుల్ రోల్‌లో కనిపించనుండగా, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమా డిసెంబర్ లో వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించిన హైప్ ఇప్పటికే ఆకాశాన్ని తాకుతోంది.
సినిమా కథ పాత సినిమా థియేటర్ నేపథ్యంలో సాగుతుందని, ప్రభాస్ ఒక థియేటర్ యజమానిగా, మరో పాత్రలో ఆత్మగా కనిపిస్తారని తెలుస్తోంది. 2022 అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం, ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలతో పాటు సమాంతరంగా చిత్రీకరణ జరుపుకుంది. కానీ మధ్యలో పలుమార్లు బ్రేకులు పడ్డాయి. అనంతరం గ్రాఫిక్స్ వర్క్ వల్ల కూడా ఆలస్యం అయ్యింది.
గతంలో మారుతి చిన్న బడ్జెట్ కామెడీ చిత్రాలకు పేరుగాంచినప్పటికీ, ఈ సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇక టీజర్ గురించి తాజా బజ్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. రెండు నిమిషాలకు పైగా ఉండే ఈ టీజర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్, స్వాగ్‌తో నిండిన యాక్షన్ షాట్స్, ఆకట్టుకునే డైలాగ్‌లు ఉంటాయని సమాచారం.
టీజర్‌లో మారుతి తనదైన కామెడీ, హారర్, రొమాన్స్ మిక్స్‌ను సమర్థవంతంగా చూపించారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ గత చిత్రాలైన ‘బాహుబలి’, ‘సలార్’లో యాక్షన్ హీరోగా మెప్పించినప్పటికీ, ఈ సినిమాలో ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తరహా రొమాంటిక్, కామెడీ లుక్‌ను హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా టీజర్‌లోని ఒక యాక్షన్ షాట్ అభిమానులను థియేటర్లలో కేకలు వేయించేలా ఉంటుందట. మారుతి ఈ చిత్రంలో ప్రభాస్ స్టార్ ఇమేజ్‌ను సరైన రీతిలో ఉపయోగించుకున్నారని, ఫ్యాన్స్ డిమాండ్‌ను తీర్చేలా సినిమాను తీర్చిదిద్దారని అంటున్నారు. ఇక ఈ టీజర్ విడుదలతో ‘ది రాజాసాబ్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో లీకైన కొన్ని సెట్ వీడియోలు, ఫోటోలు వైరల్ కాగా, టీజర్‌తో అధికారికంగా సినిమా విజువల్స్ బయటకు రానున్నాయి. మరి ఫ్యాన్స్ కు ఈ విజువల్స్ ఎలాంటి కిక్ ఇస్తాయో చూడాలి.