ప్రభాస్ దర్శనం.. ఇక ‘రోమాంచకం’ కౌంట్‌డౌన్ షురూ!

‘రోమాంచకం’ రిలీజ్‌కు ఒక్క రోజు ముందు సుమంత్ ప్రభాస్‌కు ఒక డ్రీమ్ మూమెంట్ దక్కింది.

Update: 2026-09-02 10:14 GMT

‘రోమాంచకం’ రిలీజ్‌కు ఒక్క రోజు ముందు సుమంత్ ప్రభాస్‌కు ఒక డ్రీమ్ మూమెంట్ దక్కింది. ఎప్పటి నుంచో అభిమానించే ప్రభాస్‌ను డైరెక్ట్ గా కలిశాడు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఒక ఫోటోలో ప్రభాస్ సుమంత్ భుజంపై చేయి వేసి కనిపించగా, మరో ఫోటోలో ఇద్దరూ హగ్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ టెన్షన్ మధ్య సుమంత్‌కు ఇది ఊహించని స్పెషల్ మూమెంట్‌.




 


అయితే ఈ మీటింగ్‌కు సంబంధించిన చిన్న వీడియో ముందే వచ్చింది. అందులో ప్రభాస్ ముఖం చూపించకుండా, సుమంత్ షర్ట్‌పై సంతకం చేస్తున్న భాగాన్ని మాత్రమే బయటపెట్టారు. సుమంత్ షర్ట్‌పై ప్రభాస్ రాసిన మాటలు కనిపించడంతో అప్పుడే అది వైరల్ అయింది. ప్రభాస్ కనిపించకపోయినా చేతి సంతకంతోనే ఎవరో అర్థమయ్యేలా ఆ వీడియోను కట్ చేశారు.




 


ఇప్పుడు మాత్రం సుమంత్ పూర్తి ఫోటోలు షేర్ చేశాడు. “లైవ్‌లో చూసి చెప్తున్నా.. మన డార్లింగ్ బంగారం. ఐ లవ్ యూ అన్నా” అంటూ ప్రభాస్‌పై తన ప్రేమను బయటపెట్టాడు. సుమంత్‌కు ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో కొత్త విషయం కాదు. తన పేరులోనే ‘ప్రభాస్’ పెట్టుకున్న స్థాయి అభిమానం అతనిది. అలాంటి హీరో పక్కన నిలబడి ఫోటో దిగడం అతనికి కెరీర్‌లోనే గుర్తుండిపోయే రోజు.

ఈ ఫోటోలకు ‘రోమాంచకం’ టీమ్ కూడా తమదైన టచ్ ఇచ్చింది. “రెబెల్లింగ్ మూమెంట్స్.. హైలీ స్పిరిటెడ్” అంటూ పోస్ట్ చేసింది. ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘రోమాంచకం’ను సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండటంతో ఆ క్యాప్షన్‌కు రెండు సినిమాల కనెక్షన్ కూడా కలిసొచ్చింది.

‘మేమ్ ఫేమస్’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ఇప్పుడు ‘రోమాంచకం’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈసారి భద్రకాళి పిక్చర్స్ టీమ్ అతని వెనుక ఉండటం వల్ల సినిమా మొదటి నుంచే వేరే స్థాయిలో కనిపిస్తోంది. రిలీజ్‌కు ముందు ప్రభాస్‌తో దక్కిన ఈ మీటింగ్ మాత్రం సుమంత్‌కు సినిమా లెక్కలతో సంబంధం లేని ఫ్యాన్‌బాయ్ మెమరీగా మిగిలిపోతుంది.

ఇక ‘రోమాంచకం’ కౌంట్‌డౌన్ కూడా మొదలైంది. సెప్టెంబర్ 3న సినిమా థియేటర్లలోకి వస్తుండగా, ఈ రాత్రే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు. అంటే ప్రభాస్‌తో ఫోటోలు బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే సుమంత్ సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతోంది. రేపటి రెగ్యులర్ రిలీజ్‌కు ముందే ఈ రాత్రి ప్రీమియర్ టాక్ బయటకు వస్తుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఫ్యాన్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News