కన్నప్ప.. డార్లింగ్ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది?
ఇక స్క్రీన్ పై తమ అభిమాన హీరోను చూసి ఫుల్ గా సాటిస్ఫై అయ్యారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ప్రభాస్ రోల్ అండ్ క్యారెక్టరైజేషన్ అదిరిపోయిందని చెబుతున్నారు.;
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మహా శివుడి పరమ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఆ సినిమాలో విష్ణు లీడ్ రోల్ కనిపించారు. మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు గ్రాండ్ గా నిర్మించారు.
అయితే సినిమా కోసం భారీ క్యాస్టింగ్ ను రంగంలోకి దించిన మేకర్స్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను కూడా తీసుకురావడం విశేషం. సినిమాలో రుద్ర రోల్ లో ఆయన కనిపించారు. తనదైన యాక్టింగ్ తో డార్లింగ్ అదరగొట్టారు. ముఖ్యంగా విష్ణు.. ప్రభాస్ మధ్య ఉన్న సీన్స్ అయితే వేరే లెవెల్. సినిమాకు మెయిన్ హైలెట్స్ లో ప్రభాస్ రోలే ఫస్ట్ అని చెప్పాలి.
అదే సమయంలో రిలీజ్ కు ముందే ప్రభాస్ రోల్ పై క్లారిటీ ఇచ్చి మంచి హోప్స్ క్రియేట్ చేశారు మేకర్స్. ప్రభాస్ స్క్రీన్ టైమ్ ను కూడా రివీల్ చేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ సినిమా అన్నట్లే ట్రీట్ చేశారు. థియేటర్స్ వద్ద సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చుతూ కేక్ కట్ చేశారు. పెద్ద పెద్ద కటౌట్స్ కూడా కట్టారు.
ఇక స్క్రీన్ పై తమ అభిమాన హీరోను చూసి ఫుల్ గా సాటిస్ఫై అయ్యారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ప్రభాస్ రోల్ అండ్ క్యారెక్టరైజేషన్ అదిరిపోయిందని చెబుతున్నారు. విష్ణు చెప్పినట్లు.. ప్రభాస్ స్క్రీన్ టైమ్ 40 నిమిషాలు లేకపోయినా ఉన్నదానితో సంతృప్తి చెందామని కామెంట్లు పెడుతున్నారు. డార్లింగా మజాకా అని అంటున్నారు.
అదే సమయంలో కన్నప్పలో ఉన్న చిన్న చిన్న లోపాలు.. రుద్ర క్యారెక్టర్ ద్వారా కవర్ అయిపోయాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ రోల్ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని అంటున్నారు. డైలాగ్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. ప్రభాస్ రోల్ తర్వాత సినిమాలోని మిగతా అంశాల కోసం ఇప్పుడు ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు.
మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కన్నప్ప విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెగ పోస్టులు షేర్ చేస్తున్నారు. డార్లింగ్ క్యారెక్టర్ పై రివ్యూస్ ఇస్తున్నారు. ప్రమోషన్లకు దూరంగా ఉన్నా.. సినిమాలో యాక్టింగ్ తో అదరగొట్టారని కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు కన్నప్ప మూవీ చూశారా? ప్రభాస్ రోల్ మీకెలా అనిపించింది?